వజ్రోత్సవాలను విజయవంతం చేయాలి: రేగా కాంతారావు
పినపాక నియోజకవర్గం ఆగష్టు 10( జనం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో వజ్రోత్సవ వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పలు రకాల మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. భారత స్వతంత్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి జాతీయ భావం పెంపొందించేలా రోజుకో కార్యక్రమం చేపట్టనున్నారు.ఈవేడుకలను హై దరాబాదులో సీఎం కేసీఆర్ ప్రారంభించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు భిన్నంగా తెలంగాణలో స్వతంత్ర సమరయోధులు త్యాగాలను భావితరాలకు తెలియజేసే విధంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. మహాత్మా గాంధీ చరిత్రను భావితరాలకు తెలియజేయాలని ప్రతి ఏరియాలోని థియేటర్లలో గాంధీ సినిమాను ప్రదర్శించనున్నారు. రెండు వారాలపాటు నిర్వహించే వేడుకల్లో అందరు భాగసామ్యులై విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మణుగూరు మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ నాయకులు, పలు శాఖల ప్రభుత్వాధికారులు ,ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు…