వజ్రోత్సవాలలో ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలి
-కలెక్టర్ శశాంక
మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్ 14(జనంసాక్షి)
జిల్లా, పోలీస్ యంత్రాంగంతో పాటు ప్రజాప్రతినిధుల సహకారం, బాధ్యతతో
తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను విజయవంతం చేసి జిల్లాకు పేరు ప్రతిష్టలు తేవాలని మహబూబాబాద్ శాసన సభ్యులు బాణోత్ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు. మహబూబాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఈనెల 16వ తేదీన నిర్వహించనున్న ర్యాలీ ఏర్పాట్లను శాసనసభ్యులు శంకర్ నాయక్ తో కలిసి
కలెక్టర్ శశాంక , ఎస్.పి. శరత్ చంద్ర పవార్, బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో ఏర్పాట్లపై సమీక్షించి పలు సూచనలు ఆదేశాలు చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో పాల్గొనడం ప్రతి ఒక్కరు గర్వంగా తీసుకోవాలని ఆయన అన్నారు. ఇట్టి కార్యక్రమాలను విజయవంతం చేయడానికి ప్రజాప్రతినిధులు అధికారుల సహకారంతో చాలెంజ్గా తీసుకొని జిల్లాలో ఘనంగా నిర్వహించాలని సూచించారు. 16వ తేదీన నియోజకవర్గ కేంద్రంలో జరిగే ర్యాలీకి మండలాలతో పాటు మున్సిపాలిటీ పరిధిలోని ప్రజాప్రతినిధులు వారికి సూచించిన విధంగా ప్రతి ఒక్కరు ర్యాలీలో పాల్గొనే విధంగా సహకరించాలని కోరారు. జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తుందని ఇటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందస్తు చర్యలతో జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను విజయవంతం చేయాలని శాసనసభ్యులు అన్నారు. అదేవిధంగా ఎన్నడూ కని విని ఎరగని రీతిలో 50 కోట్లతో నిర్మించిన రెండు భవనాలను గౌరవ ముఖ్యమంత్రివర్యులు ఈనెల 17న హైదరాబాద్ లో ప్రారంభించిన అనంతరం జరిగే సభకు జిల్లా నుండి అధిక సంఖ్యలో గిరిజన ప్రజా ప్రతినిధులు ఉద్యోగులు స్వయం సహాయక సంఘ సభ్యులు పాల్గొనే విధంగా జిల్లా యంత్రాంగం అవసరమైన బస్సులను ఏర్పాటు చేస్తుందని ప్రజా ప్రతినిధులు అందరూ యంత్రాంగానికి సహకరించి సకాలంలో సభాస్థలికి చేరుకునే విధంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్ అన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శాసనసభ్యులు వారి సూచనల మేరకు ఈనెల 16న నిర్వహించనున్న ర్యాలీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుండి ఎన్టిఆర్ స్టేడియం వరకు కొనసాగుతుందని అనంతరం సభ ఉంటుందని ,సభ అనంతరం భోజనాల ఏర్పాట్లు ఉంటాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈనెల 16న మహబూబాబాద్ లో నిర్వహిస్తున్న భారీ ర్యాలీకి అన్ని వసతులను సమకూరుస్తున్నామని గ్రామస్థాయి నుండి మండల జిల్లా సాయి అధికారులు విధులలో ఉంటారని ర్యాలీలో ప్రజాప్రతినిధులు కళాశాల విద్యార్థులు స్వయం సహాయక సంఘాల మహిళలు గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కలెక్టర్ అన్నారు. 17వ తేదీన హైదరాబాద్ లో జరిగే సంత్ సేవాలాల్ భవనం ,కొమరం భీం ఆదివాసి భవనం ప్రారంభం అనంతరం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు పాల్గొనే సభకు మహబూబాబాద్ నియోజకవర్గం నుండి 4000 మందిని హైదరాబాదు సభకు పంపించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించి నిర్దేశించిన సమయానికి సభకు చేరుకోవాలని సభకు వెళ్లే వారికి అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. శాసనసభ్యుల సూచనల మేరకు జిల్లా కలెక్టర్ అధికారులకు పలు ఆదేశాలు చేశారు. అన్ని ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. శిక్షణ కలెక్టర్ పరమార్ పింకేశ్వర్కుమార్ లలిత్ కుమార్, అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, స్పెషల్ ఆఫీసర్ సన్యాసయ్యా,,ఆర్డిఓ కొమురయ్య, జిల్లా పరిషత్ సీఈవో రమాదేవి , జెడ్పీటీసీలు, ఎంపిటిసిలు, కౌన్సిలర్స్, ఇతర ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.