వజ్రోత్సవాల్లో భాగంగా హరితహారం లో పాల్గొన్న – ఎమ్మెల్యే.
కూసుమంచి ఆగస్టు 21 ( జనం సాక్షి ) : భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాల పూర్తి అయినందున భారత ప్రభుత్వం వజ్రోత్సవాల పిలుపుమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వజ్రోత్సవాల నిర్వహణ కమిటీ రోజువారీ కార్యక్రమాలు రూపొందించిన విధంగా రాష్ట్రవ్యాప్తంగా వజ్రోత్సవాల 14వ రోజైన హరితహారం నిర్వహించాలని రూపొందించారు దానిలో భాగంగా ఆదివారం నాడు మండలంలోని నాయకన్ గూడెం గ్రామంలో పాలేరు శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి పాల్గొని మొక్కను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని అలా చేసినట్లయితే వాతావరణంలో కాలుష్యం తగ్గి రానున్న రోజుల్లో వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండుతాయి ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిపి బస్వా రెడ్డి, స్థానిక సర్పంచ్ కాసాని సైదులు, ఉప సర్పంచ్ కిన్నెర శ్రీకాంత్, మండల పరిషత్ అధ్యక్షులు బానోతు శ్రీనివాస్ నాయక్, డిసిసిబి డైరెక్టర్ ఇంటూరి శేఖర్, మండల అభివృద్ధి అధికారి కరుణాకర్ రెడ్డి, మండల తాసిల్దార్ మీనన్, ఎంపీఈవో, అటవీశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.