వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో స్ఫూర్తినిచ్చేలా వివేకానంద విద్యార్థుల ప్రదర్శన.
రాజన్న సిరిసిల్ల బ్యూరో, ఆగస్టు 22 (జనం సాక్షి). ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ ముగింపు వేడుకల్లో భాగంగా పట్టణంలోని వివేకానంద విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శన స్ఫూర్తిదాయకంగా నిలిచింది. సోమవారం పాఠశాల ఆవరణలో విద్యార్థిని విద్యార్థులు భారత దేశ భౌగోళిక స్వరూపాన్ని ప్రతిబింబించేలా నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంది. భారతీయుల ఐక్యత స్ఫూర్తిని విద్యార్థుల్లో పెంపొందించేందుకు ప్రదర్శన నిర్వహించినట్లు పాఠశాల నిర్వాహకులుభుచ్చా రావు తెలిపారు. కార్యక్రమంలో పలువు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.