వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఇంటింటికి జాతీయ జెండా పంపిణి

 

పినపాక నియోజకవర్గం ఆగస్టు 09 (జనం సాక్షి): స్వాతంత్ర్యం సిద్దించి నేటికీ75 వసంతాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 08 నుంచి 22 వ వరకు ఇంటింటా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలనే వినూత్న కార్యక్రమాలను చేపట్టింది.ఈ నేపద్యంలో మణుగూరు మండలం సింగారం గ్రామపంచాయతీ పరిధిలోని కాలనీలలో జడ్పిటిసి పోశం నరసింహారావు సూచన మేరకు ప్రతి ఇంటికి జాతీయ జెండా ను పంచాయతీ కార్యదర్శి పంపిణీ చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ వజ్జోత్సవ వేడుకలను ప్రతి ఇంట పెద్దఎత్తున జరువుకోవాలని మంగళవారం ఇంటింటికి జాతీయ జెండాని అందచేశారు. ఈ కార్యక్రమాలలో మండల ప్రజలు అందరూ భాగస్వామ్యులై దేశ భక్తిని, జాతీయ భావాన్ని ఘనంగా చాటాలని పిలుపునిచ్చారు.ఈ నెల 15 తేది న ఉదయం సామూహికంగా జాతీయ గీతాలాపన జరుగుతుందని ఆ రోజు పట్టణాలలో, గ్రామాలలో ప్రజలు ప్రధాన కూడళ్ళ దగ్గరికి పెద్ద ఎత్తున చేరుకోవాలని ,గీతాలాపన చేసే సమయంలో దేవాలయం, మాజిద్, చర్చి ల నుంచి సైరన్ మొగుతుందని సైరన్ మోగిన వెంటనే ఇండ్లలో ఉన్నవారు రోడ్ల మీదకు వచ్చి జాతీయ గీతం పాడి దేశ భక్తిని, జాతీయ భావాన్ని చాటుతూ మహనీయుల త్యాగాలను, స్ఫూర్తిని స్మరిస్తూ భారత కీర్తిని దశ దిశల చాటాలని అన్నారు. వజ్రోత్సవ వేడుకలకు మన వంతుగా ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో కోసం నరసింహారావు వీరబాబు, ఈవో ఆర్ డి వెంకటేశ్వర్లు సమితి సింగారం సర్పంచ్ బచ్చల భారతి కార్యదర్శి శ్రీకాంత్, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.