వణికిస్తున్న విషజ్వరాలు

ప్రైవేట్‌ ఆస్పత్రల్లో రోగులు

అమరావతి,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): మరోమారు డెంగీ,మలేరియా తదితర వ్యాధులు ఎపిని వణికిస్తున్నాయి. స్వచ్ఛభారత్‌ డొల్లతనాన్ని బయటపెట్టింది. ఈ కార్యక్రమం కేవలం ప్రచారానికే పరిమితం అయ్యింది. పలుచోట్ల పారిశుద్యం కొరవడి డెంగ్యే విజృంభించడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. పందులను పట్టణంలో లేకుండా చేయడం, పారఇశుద్యం కల్పించి దోమల నివారణకు తీసుకున్న చర్యలు ఫలించలేదు. అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలు శూన్యంగా ఉన్నాయి. దీనికితోడు వ్యాధుల తీవ్రతతో వచ్చే వారినుంచి ప్రైవేట్‌ ఆస్పత్రులు దోపిడీకి పాల్పడుతున్నాయి. డెంగీ వ్యాధి నిర్దారణకు సంబంధించి ప్రభుత్వాస్పత్రిలో మాత్రమే రక్తపరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలకు సంబంధించి మొదటిది ర్యాపిడ్‌, రెండోది ఎలీసా టెస్ట్‌లు చేయాల్సి ఉంటుంది. ర్యాపిడ్‌ టెస్ట్‌లో మూడు రకాలు ఉంటాయి. ఈ టెస్ట్‌లలో పాజిటివ్‌ వస్తే ఎలీసా పరీక్ష చేస్తారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచిస్తున్నారు.విష జ్వరాల బారిన పడిన చాలా మంది ప్రైవేట్‌ ఆస్పత్రును ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. వ్యాధి నిర్దారణకు సంబంధించి స్పష్టత లేకున్నా… ప్రజల బలహీనతను ఆసరా చేసుకున్న ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలు ర్యాపిడ్‌ టెస్ట్‌లు నిర్వహిస్తూ తాము సరైన చికిత్స అందిస్తామని సొమ్ము చేసుకుంటున్నాయి. పరిస్థితి విషమించినప్పుడు చేతులెత్తేసి, మెరుగైన చికిత్స కోసం ప్రవేట్‌ ఆస్పత్రులకు తీసుకెళ్లాలని సూచిస్తున్నాయి.

తాజావార్తలు