వనపర్తి జిల్లా వాహనాల తనిఖీల్లో 4,65,000/- నగదు 150 లీటర్ల మద్యం పట్టివేత

వనపర్తి జిల్లా వాహనాల తనిఖీల్లో 4,65,000/- నగదు 150 లీటర్ల మద్యం పట్టివేత

వనపర్తి బ్యూరో అక్టోబర్13( జనంసాక్షి)ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వనపర్తి జిల్లా పోలీసులు సిబ్బందితో గురువారం రాత్రి జిల్లాలో పలు చోట్ల వాహనాల తనిఖీలు నిర్వహించారు.
వనపర్తి పట్టణం లో రిలయన్స్ ట్రెండ్స్ ముందు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి నుండి 95000/-రూపాయలు పట్టుకోనైనది,
పెద్దమందడి పోలీస్ స్టేషన్ పరిధిలోని వెల్టూర్ చెక్ పోస్ట్ దగ్గర కొత్తకోట సీఐ శ్రీనివాస్ రెడ్డి పెద్దమందడి ఎస్సై హరిప్రసాద్ తమ సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా హైదరాబాద్ నుండి కర్నూల్ వెళ్తున్న కారు ను తనిఖీ చేయగా అందులో 70,000/- రూపాయలు సిజ్ చేసినారు, పెబ్బేరు పోలీస్ స్టేషన్ పరిధిలో రంగాపూర్ దగ్గర వాహనాల తనకి నిర్వహిస్తుండగా ఒక కారులో 2,00,000 రూపాయలు శ్రీరంగపురం పోలీస్ స్టేషన్ పరిధిలో 1,00,00 రూపాయలు సీజ్ చేశారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎవరైనా డబ్బులు తీసుకు వెళ్లే సమయంలో వాటికి సంబంధించిన రసీదు, తగిన పత్రాలు ఉండాలని లేని యెడల వాటిని సీజ్ చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. వనపర్తి జిల్లాలో మొత్తం 4, 65,000/- రూపాయలు ఫీజ్ చేయడం జరిగినది. అలాగే 150 లీటర్ల మధ్యo సీజ్ చేశారు.