వరంగల్ జిల్లా స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన రంగశాయిపేట విద్యార్థులు

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 04 ( జనం సాక్షి)

వరంగల్ నగరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల రంగశాయిపేటలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు 67వ పాఠశాలల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన కబడ్డీ,ఖో-ఖో అండర్ -14 అండర్-17 బాలబాలికలజోన్ సెలక్షన్స్ లో మెరుగైన ప్రతిభ కనబరిచి, వరంగల్ జిల్లా స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైనారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి. రామక్రిష్ణారెడ్డి మరియు గోగు నారాయణ తెలిపారుఈ సందర్భంగా పాఠశాలలో క్రీడాకారులను అభినందించి, భవిష్యత్తులో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు.