వరదముప్పును గుర్తించి కరకట్టను నిర్మించాం
శాశ్వత ప్రాతిపదికన ఆలోచించామన్న బాబు
భద్రాచలం,జూలై29(జనంసాక్షి ): టీడీపీ హయాంలో 20 ఏళ్ల క్రితం కట్టిన కరకట్ట వల్లే భద్రచాలం పట్టణం సురక్షితంగా ఉందని మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. భారీగా వరద వచ్చినా.. భద్రాచలం ప్రజలందరూ ధైర్యంగా నిద్రపోయారని తెలిపారు. కరకట్ట పైకి వరకు వరద వచ్చిందని.. తాము భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని కరకట్టను నిర్మించడం జరిగిందన్నారు. తాను ఈ విషయం మరిచిపోయినా.. ఇక్కడున్న వారు గుర్తుకు తెచ్చుకుంటున్నారని వెల్లడిరచారు. ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లోని విలీన మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు రెండోరోజు పర్యటించారు. పర్యటనలో భాగంగా రెండో రోజు శుక్రవారం భద్రాచలంలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఉదయం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు కూడా భారీగా హాజరయ్యారు. విలీన ఐదు గ్రామాల సమస్యపై చంద్రబాబు పార్టీ నేతలతో చర్చించారు. శ్రీరాముడి ఆదేశాల మేరకు 20 సంవత్సరాల క్రితం కరకట్టడం జరిగిందన్నారు. భ్రదాచలం టౌన్ క్షేమంగా ఉందంటే.. చాలా సంతోషంగా ఉందన్నారు. కరకట్ట సమయంలో కొంతమంది ఊహించలేదని…దాని ఫలితం ఇప్పుడు చూస్తున్నారు. ఏ పని చేసినా శాశ్వతంగా గుర్తుండేలా చేయాలని, వరదలు వచ్చిన సమయలో ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని సూచించారు. ఇంకా చిన్న చిన్న గ్యాప్ లున్నట్లు, భవిష్యత్ లో ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా శాశ్వత పరిష్కారం చూపాలని వెల్లడిరచారు.