వరదలపై సీఎం సమీక్ష
` శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
` ఓఆర్‌ఆర్ వరకు వరదముప్పు తొలగించాలి
` ఆ నీరంతా మూసీకి చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి
` చెరువులు, నాలాలు, కాలువలన్నీ నదికి అనుసంధానించాలి
` నగరంలో వర్షాలు, వరదల ప్రభావంపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
హైదరాబాద్: నగరంలో వర్షాలు, వరదల ప్రభావంపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. వర్షాలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, వరద సమస్యకు శాశ్వత పరిష్కారంపై ఆరా తీశారు. గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్‌లో తలెత్తిన పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరద ప్రవాహానికి అడ్డంకుల వల్లే ఈ దుస్థితి తలెత్తుతోందని అధికారులు వివరించారు. ఓఆర్‌ఆర్ వరకు వరదనీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వరదనీరంతా మూసీకి చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. చెరువులు, నాలాలు, కాలువలన్నీ మూసీకి అనుసంధానించాలన్నారు. చెరువుల పునరుద్ధరణ, నాలాల వెడల్పు త్వరగా పూర్తి చేయాలని సూచించారు.