వరద నీరుతో మునిగిన పంటపొలాలు
ఆదిలాబాద్, జూలై 25 : జిల్లాలో భారీగా కురిసిన వర్షాల వల్ల వాగులు, చెరువులు పొంగి పంట భూములు నీట మునిగాయి. అనేక గ్రామాలకు రవాణ సౌకర్యం నిలిచిపోయింది. పెనుగంగనది వరదతో సుమారు 5 మండలాలలోని అనేక గ్రామాలు జలమయమయ్యాయి. జైనట్, దేలా, సర్పుర్, బెజ్జూరు, కౌటాల తదితర మండలాలలోని వేలాది ఎకరాలలో నీరు చేరింది. ఈ వరద నీటిలో రైతులకు, ప్రజలకు ఎంతమేరకు నష్టంవాట్టిల్లిందని విషయం సర్వే చేస్తేకాని తెలియదు. మూడు రోజులుగా కురిసన వర్షాల వల్ల అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి. పెనుగంగనది వరదతో నష్టపోయిన విషయాన్ని వరద నీరు తగ్గిన తర్వాత సర్వే చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ వర్షాల వల్ల అనేక ప్రాంతాల్లో రోడ్లపై ఉన్న వంతెనలు ప్రమాదకరంగా మారాయి. గత నెల రోజులుగా ఎదురు చూసిన ప్రజానీకానికి మూడు రోజులుపాటు కురిసిన వర్షాలు ఊరటను ఇచ్చాయి.