వరద బాధితులకు మెట్ట ప్రాంతంలో ఇండ్ల స్థలాలు ఇవ్వాలి
సిపిఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసి
– కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వినతి పత్రం అందజేత…
బూర్గంపహాడ్ ఆగస్టు 18 (జనంసాక్షి)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం గోదావరి ముంపు వరద బాధితులకు మెట్ట ప్రాంతంలో ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ ఎం ఎల్ న్యూడెమోక్రసి ఆధ్వర్యంలో కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం వరద బాధితులు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కి వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ కొద్ది రోజులలోనే మీకు తప్పకుండ మెట్ట ప్రాంతంలో ఇండ్ల స్థలాలను ఇస్తామని వరద బాధితులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమలో సిపిఐ ఎం ఎల్ న్యూడెమోక్రసి జిల్లా కార్యవర్గ సభ్యులు యస్ కె ఉమర్, భద్రాచలం డివిజన్ కార్యదర్శి మోరా రవి, పాల్వంచ సబ్ డివిజన్ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు, కొత్తగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి సురేందర్, న్యూడెమోక్రసి నాయకులు ముత్యాల సత్యనారాయణ, జక్కుల రాంబాబు, పున్నంచంద్, వై యస్ రెడ్డి, పి ఓ డబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు ఉమా, బట్టు రవి, అలివేలు, చిన్నమ్మాయి, డేగల శ్రీను, జ్యోతి, ఈశ్వరమ్మ, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.