వరద బాధితుల సాయం కోసం తహసిల్దార్ కార్యాలయం ముందు అఖిలపక్షం ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన.
– అధికార పార్టీ వారు సైతం పెదవి విరుపులు.
బూర్గంపహాడ్,08(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం ముందు అఖిలపక్షం ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
వరద ప్రాంతాల్లో బాధితులకు న్యాయం జరగాలని స్థానిక అఖిలపక్ష నాయకులు తహశీల్దారుకి వినతి పత్రం అందజేశారు. చాలా మంది అర్హులైన బాధితులకు నేటికి నష్టపరిహారం-వరథసాయం అందలేదని వాపోతూ వారు సోమవారం బూర్గంపహాడ్ మండల కేంద్రంలో అఖిలపక్ష పార్టీల నేతృత్వంలో రోడ్ పై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు-సదురు బాధితులు మాట్లాడుతూ వరద సహాయం విషయంలో కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకొని అర్హులైన వరద బాధితులను గుర్తించి వారికి తగిన న్యాయం-వరద పరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు. వరద ముంపు సాయం అందక అధికార పార్టీ వారు కొందరు పెదవి విరుస్తున్నారని, జులై నెలలో వచ్చిన గోదావరి అధిక వరదల వల్ల కట్టు బట్టలతో పునరావాస కేంద్రాలలో ఆశ్రయం పొందిన బాధితులను గుర్తించటంలో అధికార యంత్రాంగం విఫలయ్యారన్నారు. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందాన అధికారుల తీరు ఉందని విమర్శించారు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రతి ఒక్క వరద బాధిత కుటుంబానికి 10000/- రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించిన మాట విదితమే… కానీ అధికారులు వారి ఇష్టనుసారం బాధితులను ఎంపిక చేసి చేతులు దులుపుకున్నారన్నారు.మళ్ళీ వరద ముంపు బాధితుల విన్నపం మేరకు అధికారులు సర్వే చేసి మిగిలిన బాధితులను గుర్తించి ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో…బూర్గంపహాడ్ మండల అఖిలపక్షానికి చెందిన నాయకులు-కాంగ్రెస్-బీజేపీ-సీపీఐ-సీపీఎం-టీడీపీ-ప్రజా సంఘాల నాయకులు-ఐ టి సి బి ఎం ఎస్ ప్రతినిధులు-యువజన కాంగ్రెస్ నాయకులు-వరద బాధిత ప్రజలు-