వరి పంట మెదల చోరీనిందితులపై ఫిర్యాదు చేసిన దళిత మహిళతనకు న్యాయం చేయాలని*గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట క్రిమిసంహారక మందు తో నిరసన
పెన్ పహాడ్. నవంబర్ 02 (జనం సాక్షి): తాను గత పది సంవత్సరాలుగా సర్వే నెంబర్ 131/9/1లొని 14 కుంటల కబ్జా భూమి లో ఉంటూ గత నెల 27న ధరణి ద్వారా గ్రామానికి చెందిన రైతు చింతరెడ్డి వెంకట రెడ్డి నుండి కొనుగోలు చేసిన భూమిని పట్టా చేయించుకోగా ఈ వానాకాలం సాగులో పంట సాగుచెయ్యగా పంట చేతికి వచ్చి కోసిన పంట పొలాన్ని గ్రామానికి చెందిన అనిరెడ్డి విజయ భాస్కర్రెడ్డి, సుగుణమ్మ, ముదిరెడ్డి రంగారెడ్డి కోసిన వరి మెదల చోరీకి పాల్పడ్డారని అదే గ్రామానికి చెందిన భూకబ్జాలొ ఉన్న దళిత మహిళ ఇటుకల నాగేంద్ర శ్రీనివాస్ ఆరోపించారు బుధవారం ఈ సందర్భంగానే మండల పరిధిలోని మాచరం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట క్రిమిసంహారక మందు బాటిళ్లతొకుటుంబ సభ్యులతో కలిసి నిరసన తెలిపారు అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా దళిత మహిళనైన తనను ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఎస్ఐకి ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తాను సాగుచేసిన పంట సుమారు 30 వెల విలువ ఉంటుందని తన వరి మెదలను గత నెల 31తారీఖు రాత్రి చోరీ చేసి ధీరావత్ నాగ్నాయక్ ఇంటికి తరలించి అనంతరం ట్రాక్టర్పై గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉంచారని ఆరోపించారు ఇంత జరుగుతున్నా తనకు పోలీసులు న్యాయం చేయడం లేదని తాను క్రిమిసంహారక మందు తాగి చనిపోతామని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని కోరారు దీనిపై ఎస్సై శ్రీకాంత్గౌడ్ను వివరణ కోరగా ఈ భూమిపై ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఇరు వైపుల వారు ఫిర్యదు చేశారని వారి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.