వరుసగా ఆరోరోజూ పెరిగిన పెట్రో ధరలు


` మండిపడుతున్న వాహనదారులు
న్యూఢల్లీి,మార్చి 28(జనంసాక్షి):దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.పెట్రో ధరలు మరోసారి పెరిగాయి. వారం వ్యవధిలో ఆరుసార్లు పెట్రో ధరలను చమురు సంస్థలు పెంచాయి. తాజాగా సోమవారం లీటర్‌ పెట్రోల్‌ పై సగటను 30 పైసలు, డీజిల్‌ పై 35 పైసలు పెంచుతున్నట్లు ప్రకటించాయి ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు. దీంతో ధరల పెంపును చేపట్టిన వారంరోజుల్లోనే లీటరు పెట్రోల్‌ పై 4 రూపాయలు, డీజిల్‌ పై 4 రూపాయల 10 పైసలు పెరిగాయి. హైదరాబాద్‌ లో పెట్రోల్‌ 112 రూపాయల 71 పైసలు, డీజిల్‌ 99 రూపాయల 7 పైసలుగా ఉంది. విశాఖలో పెట్రోల్‌ 113 రూపాయల 34 పైసలు, డీజిల్‌ 99 రూపాయల 33 పైసలకు పెరిగింది.దేశ రాజధాని ఢల్లీిలో పెట్రోల్‌ 99 రూపాయల 41 పైసలు, డీజిల్‌ కు 90 రూపాయల 77 పైసలుగా ఉంది. ముంబయిలో పెట్రోల్‌ 114 రూపాయల 19పైసలు.. డీజిల్‌ 98 రూపాయల 50 పైసలకు పెరిగింది. చెన్నైలో పెట్రోల్‌ 105 రూపాయల 18 పైసలు… డీజిల్‌ 95 రూపాయల 33 పైసలకు చేరింది. కోల్‌ కతాలో పెట్రోల్‌ 108 రూపాయల 85 పైసలు, డీజిల్‌ కు 93 రూపాయల 92 పైసలకు ఎగబాకింది.