వర్గీకరణపై కేంద్రంపై ఒత్తిడి పెంచాలి 

విజయవాడ,నవంబర్‌29(జ‌నంసాక్షి): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్సీవర్గీకరణపై కేంద్రంపై ఒత్తిడి పెంచాలని  ఎమ్మార్పీఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. వర్గీకరణ కోసం  కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఈ  పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గతంలో కేంద్ర మంత్రి వెంకయ్య మాట్లాడిన మాటలకు, ఇప్పుడు భాజపా నేతల మాటలకు పొంతన లేకుండా పోయిందన్నారు. భాజపా ఎన్నికల హావిూల్లో వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాదిగలను నమ్మించిందని, అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు కావస్తున్నా వర్గీకరణ అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మండిపడ్డారు. రానున్న శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలన్నారు. తెలుగు రాష్ట్రాలకు  సంబంధించి వర్గీకరణ అంశాన్ని దేశం మొత్తానికి చుట్టి ఎస్సీ వర్గీకరణ అంశంపై కేంద్రం జాప్యం చేస్తుందన్నారు. దీనిపై సిఎం చంద్రబాబు చిత్తశుద్దితో పనిచేయాలని అన్నారు.