వర్షాకాలంలో ప్రజలు జాగ్రతలు పాటించాలి

మరిపెడ, జులై 16(జనం సాక్షి ):వర్షాకాలం లో ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలని 3వార్డ్ కౌన్సిలర్ రేఖ లలిత వెంకటేశ్వర్లు, వైద్యధికారి సతీష్ అన్నారు. శనివారం మున్సిపల్ కేంద్రం లోని మూడవ వార్డ్ లోని సీతారాంపురం కాలనీ లో మరిపెడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం,సీతారాంపురం హెల్త్ సబ్ సెంటర్ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులు దారిచేరకుండా హెల్త్ క్యాంపు నిర్వహించారు, ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ,డోర్నకల్ శాసనసభ్యులు డీ ఎస్ రెడ్యానాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు  ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్మన్ గుగులోత్ సింధూర రవి నాయక్, కమిషనర్ సత్యనారాయణ రెడ్డిలా సూచన మేరకు,వర్షాకాలంలో ముందాస్తూ జాగ్రత్తగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలు ఇంటి పరిసరాలలో పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వా లేకుండా చూసుకోవలన్నారు.ఈ కార్యక్రమం లో కో ఆప్షన్ సభ్యులు షేక్ ఖైరున్ హుసైన్,3వార్డ్ టీఆరెఎస్ పార్టీ అధ్యక్షులు కొచర్ల రవి, మాజీ ఎంపిటిసీ జినక మంజుల ఉదయ్, ఏ ఎన్ ఏం లు ఝాన్సీ, శోభ, అశ్విని, ఆశాలు బల్లెం లలిత, జ్యోతి,తదితరులు పాల్గొన్నారు.
Attachments area