వర్షాకాలం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

– సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య నిర్వహణ
– మున్సిపల్ కమిషనర్  గుండె బాబు
తొర్రూరు:8 జూలై (జనంసాక్షి )
ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ గుండె బాబు తెలిపారు.
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో శుక్రవారం పట్టణంలో  జలమయమైన  పలు కాలనీలను మున్సిపల్ కమిషనర్ పరిశీలించారు.
14వ వార్డులో  జాతీయ రహదారిపై నిలిచిన నీటి తొలగింపు పై సిబ్బందికి సూచనలిచ్చారు.
 రోడ్లపై నీరు నిలవకుండా, డ్రైనేజీల్లో నీరు సాఫీగా వెళ్లేలా చెత్త తొలగింపు, పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోఎలాంటి సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని తెలిపారు. హెల్త్‌, శానిటేషన్‌ విభాగాలు సమన్వయంతో పని చేయాలన్నారు. వర్షాకాల ప్రణాళికలో పారిశుధ్యానికి, పరిశుభ్రతకు మరింత ప్రాధాన్యం ఇచ్చే కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు.
వర్షాకాలంలో ప్రజలు అంటువ్యాధుల భారీన పడకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని,
ఇంటి బయట ఉండే పాతటైర్లు, పాత వస్తువులు, తాగి పడేసిన కొబ్బరి బోండాలు, కూలర్లు తదితర వస్తువుల్లో నిల్వ ఉన్న నీటి కారణంగా దోమలు వృద్ధి చెందుతాయని తెలిపారు.
తమ ఇళ్లతోపాటు పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మునిసిపాలిటీ సిబ్బందిపై ఆధారపడకుండా ఇంటి ఆవరణలో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో మునిసిపాలిటీ సిబ్బంది అప్రమత్తంగా ఉంచామని, వర్షం పడుతున్న సందర్భంలో సిబ్బంది  అందుబాటులో ఉండి ప్రజలకు ఇబ్బంది కలగకుండా సహాయక చర్యలు చేపడుతున్నారని తెలిపారు. మున్సి పాలిటీలో వర్షాకాలంలో ప్రత్యేక శానిటేషన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తునామని,  పట్టణాల్లో వర్షపు నీరు రోడ్లుపై నిలవకుం డా తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మున్సిపాలిటీ పరిధిలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి ప్రాణనష్టం జరగకుండా వాటిని కూల్చి వేయాలని తెలిపారు. ఈదురు గాలులకు రోడ్లుపై చెట్లు పడి పోయిన వెంటనే తొలగించుటకు వీలుగా మున్సి పాలిటీలో వుడ్‌ కట్టర్‌ మిషన్లను సిద్ధంగా ఉంచామని తెలిపారు. వర్షాకాలంలో ఈదురు గాలులకు కరెంట్‌ స్తంభాలు పడిపో యి, వైర్లు తెగి పోయిన వెంటనే తిరిగి విద్యుత్‌ను పునరుద్ధరించేందు కు చర్యలు తీసుకోవాలని ట్రాన్స్‌కో అధికారులకు తెలిపారు. వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పట్టణంలోని  పీహెచ్‌సీలో, సబ్‌ సెంటర్ల లో అవసరమైన మందులను స్టాక్‌ ఉంచాలని  వైద్యాధికారులను కోరారు.
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో స్థానిక కౌన్సిలర్లు ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు.
కమిషనర్ వెంట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎన్నమనేని శ్రీనివాసరావు, స్థానికులు ఉన్నారు.