వర్షాభావంపై ముందుకు కదలాలి

 

 

 

కార్యాచరణతోనే నష్ట నివారణ సాధ్యం

విజయవాడ,జూలై31(జ‌నం సాక్షి): వరుసగా ఐదేళ్లుగా దుర్భిక్షం విలయతాండవం చేసి వ్యవసాయాన్ని దుర్భరం చేస్తోంది. తొలకరి సమయంలో కురిసిన కొద్దిపాటి వానలకు రైతులు సాగు చేసిన పంటలు అనంతరం చినుకు జాడ లేక ఎందుతున్నాయి.ప్రతి ఏటా రాయలసీమ, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు, ఇతర మెట్ట ప్రాంతాలు అనావృష్టి కోరల్లో చిక్కుకుంటున్నాయి. ఈ సంవత్సరం సైతం ఖరీఫ్‌ మొదలైందో లేదో అప్పుడే ఆయా ప్రాంతాలు వర్షాభావ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం కడప, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో వర్షాభావం నెలకొంది. రాయలసీమ రీజియన్‌లో ఈపాటికి పడాల్సిన సాధారణవర్షంలో 42 శాతంపైన లోటు ఉంది. కడపలో అయితే ఏకంగా 66 శాతం మేర తక్కువ వర్షం నమోదైంది. జిల్లాలో అన్ని మండలాలూ దుర్భిక్షం బారిన పడ్డాయి. ఒక్క రాయలసీమలోనే కాదు దాదాపు అన్ని జిల్లాలూ వర్షాభావంతో సతమతం అవుతున్నాయి. రాష్ట్రంలో 670 మండలాలుండగా 360 మండలాల్లో వర్షాభావం ఉంది. ప్రకృతి వైపరీత్యాలను తనలాగా ఈ భూప్రపంచం విూద మరెవ్వరూ ‘మేనేజ్‌’ చేయలేరని కరువు రహిత రాష్ట్రమే

తమ లక్ష్యమని తరచు ముఖ్యమంత్రి చంద్రబాబు అంటుంటారు. అయితే వర్షాభావానికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి కార్యాచరణ జరగలేదని లెఫ్ట్‌ పార్టీలు, వ్యవసాయ కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన జలహారతి, నీరు-చెట్టు, వనం-మనం కార్యక్రమాలు సాకారమయ్యాయని సిఎం, ఆయన సహచర మంత్రివర్యులు ప్రకటించుకున్న క్షేత్రస్థాయిలో అంత సంబరం లేదు. ఖరీఫ్‌ మొత్తవ్మిూద అన్ని పంటలూ కలుపుకొని 39.50 లక్షల హెక్టార్లు సాగు కావాల్సి ఉండగా ఇప్పటికి సాగైంది 16 లక్షల హెక్టార్లు. కృష్ణా, గోదావరి డెల్టాల్లో వరి నాట్లను చూపి రాష్ట్రమంతటా అన్ని పంటలూ ఇలానే ఉన్నాయనడం వాస్తవాలను కప్పిపుచ్చడమే. ప్రభుత్వం ఎప్పటికప్పుడు కరువును కప్పెట్టేందుకు శతవిధాలా యత్నించింది. రైతులు, ప్రతిపక్షాల ఆందోళనల చేపట్టడంతో కరువు మండలాల ప్రకటన చేపట్టి సవాలక్ష నిబంధనలను విధించారు. రుణమాఫీ దెబ్బ కరువు బాధితులపై పడింది. బ్యాంకులు కరువు బాధిత రైతుల రుణాలను రీషెడ్యూలు చేయట్లేదు. దీంతో అప్పుల వాయిదా లేక కొత్త అప్పు పుట్టక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి ఇంకా అప్పులపాలవుతున్నారు. కౌలు రైతుల బాధ వర్ణనాతీతం. పనుల్లేక వ్యవసాయ కూలీలు వలసలు పోతున్నారు. గ్రాసం దొరక్క పశుపోషణ భారమవుతుంది. ఇప్పటికే రాయలసీమలో పాడి పశువులను కబేళాలకు తరలిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం విూనమేషాలు లెక్కించకుండా కరువు సహాయ చర్యలకు ఉపక్రమించాలి. ప్రత్యామ్నాయ ప్రణాళికలు తయారు చేసి అమలు చేయాలి.

 

తాజావార్తలు