వర్షాల కారణంగా..

మూడు నెలల్లో 256 మంది మృతి
– 80 డ్యామ్‌లలో నీరు గరిష్ఠ స్థాయికి చేరింది
– ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం
– విలేకరుల సమావేశంలో కేరళ సీఎం పినరయ్‌ విజయన్‌
తిరువనంతపురం, ఆగస్టు16(జ‌నం సాక్షి ) : ఈ ఏడాది మే 29న రుతుపవనాలు ప్రవేశించినప్పటి నుండి ఇప్పటి వరకు 256 మంది మృతి చెందారని గురువారం ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ వెల్లడించారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేరళ విద్యుత్‌ బోర్డు, నీటి అధికారులు పర్యవేక్షిస్తున్న 80 డ్యామ్‌ల్లో నీరు గరిష్ట స్థాయికి చేరుకుందన్నారు. పెరియార్‌, చాలకుడి నదుల్లో నీటి స్థాయిలు పెరిగాయని తెలిపారు. చాలకూడి నదీకి సుమారు కిలోవిూటరు దూరంలో నివసిస్తున్న ప్రజలు దూర ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. కుట్నాద్‌ ప్రాంతంలో నీటి స్థాయి పెరుగుతుందని అన్నారు. గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో 14 జిల్లాల్లో అత్యంత ప్రమాదకర స్థాయి హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు. వర్షాల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించామన్నారు. ఎవరైన అత్యవసర సాయం కావాల్సి వస్తే టోల్‌ఫ్రీ నెంబర్‌లను ఏర్పాటు చేశామని, వాటి ద్వారా తమకు సమాచారం అందిస్తే
సిబ్బంది సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. కేంద్రం నుంచి సహాయక చర్యలు చేపట్టేందుకు బలగాలు వచ్చాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామన్నారు. ప్రస్తుతం గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో 85కుపైగా మంది మృతిచెందారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కె.జె అల్ఫాన్సో మాట్లాడుతూ 1924 నుండి వరదలు సంభవిస్తున్నాయని తెలిపారు. ఆర్మీ, నౌకాదళం, కోస్ట్‌గార్డ్‌, జాతీయ విపత్తు నివారణ దళాలు రక్షణ, సహాయ చర్యలు చేపడుతున్నాయన్నారు. తాను ప్రధాని, ¬ం శాఖ, రక్షణ శాఖను కలిసి కేరళ పరిస్థితిపై చర్చించానని అన్నారు.