వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు ఎకరాకు నలబై వేల రూపాయల చొప్పున ప్రభుత్వం నష్టరిహారాన్ని చెల్లించాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా జిల్లా కమిటీ సభ్యులు ఎర్ర అఖిల్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.జిల్లాలో నష్టపోయిన పంటను అదికారులు పరిశీలించి, సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని కోరారు.అలాగే జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాత కార్యాలయాల భవనాలు, ప్రభుత్వ పాఠశాలలు కూలిపోయే అవకాశం ఉన్నందున పరిశీలించి ప్రమాదాలు జరుగకుండా యుద్ధ ప్రాతిపాదికన కుల్చివేయాలని అన్నారు.వర్షాల కారణంగా ఇండ్లు కూలిపోయిన వారికి ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.తక్షణమే అధికారులు నష్ట నివారణ చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో ప్రజలు, రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.