వర్ష ప్రభావిత ప్రాంతాలలో ఉన్న పరిస్థితులపై అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన జిల్లా కలెక్టర్

కలెక్టర్ కె. శశాంక.

మహబూబాబాద్ బ్యూరో-జూలై 13(జనంసాక్షి)

వర్ష ప్రభావిత ప్రాంతాలలో ఉన్న పరిస్థితులపై, రానున్న మూడు, నాలుగు రోజులు చేపట్టవలసిన కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ కె. శశాంక బుధవారం సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.  వాతావరణ శాఖ సూచన మేరకు మూడు, నాలుగు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నందున అధికారులు జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కొంత మేరకు తీవ్రత తగ్గినను వాగులు పొంగుతున్నాయని, జాగ్రాత్తగా ఉండాలని, అవసరం మేరకు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, అందరూ హెడ్ క్వార్టర్ లో ఉండాలని సూచించారు. విద్యుత్ తీగెలు తెగి పశువులు మృతి చెందుతున్నందున బయటికి రాకుండా చూడాలని, ఫీల్డ్ స్టాఫ్ ను గ్రామాల్లో అందుబాటులో ఉంచి వాటిని సరి చేయాలని, తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇనుప పోల్స్ ఉన్న చోట జాగ్రత్తలు పాటించాలని, తడి చేతులతో పోల్స్ ను ముట్టుకోవద్దని, జాగ్రత్తలు తెలుపుతూ సర్పంచ్ ద్వారా టాం టాం వేయించాలని తెలిపారు.   కల్వర్టులు, లో లెవెల్ బ్రిడ్జీల వద్ద సమస్య లేకుండా చూడాలని, చిన్న డ్యామేజీల వద్ద స్యాండ్ బ్యాగులను ఏర్పాటు చేయాలని,ఎక్కువగా దెబ్బతినకుండా జాగ్రత్తలు పాటించాలని, మరొక మార్గంలో ట్రాఫిక్ ను మరల్చిన సందర్భంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని తెలిపారు. ఎక్కడా కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఆల్టర్ గా ఉండాలని తెలిపారు.  చేపలు పట్టకుండా, టూరిస్ట్ ప్రాంతాలలో ప్రజలు వెళ్లకుండా జగ్రత్తలు తిసుకోవాలని, టూరిస్ట్ ప్రదేశంలో గేట్ వద్దనే కాకుండా లోపల నీటి ప్రాంతం వద్దకు వెళ్లకుండా సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరం మేరకు రెవెన్యూ, పంచాయతీ, పోలీసు  సహకారం తీసుకోవాలని, మిషన్ భగీరథ నీరు నాణ్యతగా సప్ప్లై చేయాలని, లీకేజీ అయిన చోట కలుషితం అయ్యే అవకాశం ఉన్నందున వెంటనే లీకేజి లేకుండా చూసి శుద్ధమైన నీరు సరఫరా చేయాలని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న అంగన్వాడి లలో,పాఠశాలల్లో పిల్లలను కూర్చోబెట్టకుండా చూడాలని తెలిపారు.  పాఠశాలలు తెరిచే సమయానికి పాఠశాల ఆవరణలో నీరు నిల్వ లేకుండా చూడాలని, అలాగే గోడలు వర్షంతో నాని ఉండకుండా, వాటిని పరిశిలించి పిల్లలను కూర్చో బెట్టాలని, విద్యుత్ షాక్ గురికాకుండా ముందస్తుగా తగు ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈ టెలీకాన్ఫరెన్స్ లో ఎస్పీ శరత్ చంద్ర పవార్, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, ఎం. డేవిడ్, ఇరిగేషన్ డెప్యూటి ఎస్.ఇ. పసంద్ కుమార్, ఎస్.ఇ.-ఎన్.పిడి.సి.ఎల్., ఈ.ఈ. ఆర్ అండ్ బి – తానేశ్వర్, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి, పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ టి.సుధాకర్, డి.హెచ్.ఎస్.ఓ., సూర్యనారాయణ, ఇతర జిల్లా, మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు