వలిగొండ మండల కేంద్రంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు
వలిగొండ జనం సాక్షి న్యూస్ ఆగస్టు 20 మండల కేంద్రంలో యాదాద్రి భువనగిరి జిల్లా డిసిసి అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ప్రధాని స్వర్గీయ దివంగత నేత భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి అంకాల కిష్టయ్య ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి.శనివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీపీ నూతి రమేష్ రాజు మాట్లాడుతూ ఈ దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు అనంతరం పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాకిటి అనంతరెడ్డి బోళ్ల శ్రీనివాస్ కుందారపు కొమరయ్య పల్లెర్ల సుధాకర్ బత్తిని సహదేవ్ పాలకూర వెంకటేశం లక్ష్మీనరసు కొండూరు సాయి గంజి నారాయణ మారగోని నరసింహ ఏమో మల్లేశం కుమార్ ఉదయ్ లింగస్వామి నరసింహ సురేష్ వెంకటేష్ కృష్ణ దశరథ కృష్ణ మహేష్ తదితరులు పాల్గొన్నారు.




