వాటర్ ఫ్లాంట్ ప్రారంభించిన ఎస్సై ప్రదీప్‌కుమార్
ముత్తారం జూన్ 12 (జనంసాక్షి): మండలంలోని మైదబండ గ్రామంలో మంగళవారం వరంగల్ డయాసిస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అథితిగా ఎస్సై ప్రదీప్ కుమార్ పాల్గోని వాటర్ ఫ్లాంట్‌ను ప్రారంభించి ఆయన మాట్లాడుతు పరిశుభ్రమైన నీరు ప్రజల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఇది వాడడం వలన ఎలాంటి వ్యాధులు గాని ఫ్లోరైడ్ సమస్యగాని సీజనల్ వ్యాధులు మరే ఇతర సమస్యలు రావని ఆయన అన్నారు. ప్రజలందరు పరిశుభ్రమైన మినలర్ వాటర్ త్రాగలని ఆయన సూచించారు. వరంగల్ డయాసిస్ వారు ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ఫ్లాంట్‌కు గ్రామంలోని ప్రజలు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్లాంట్ వ్యవస్థాపకులు ఫాదర్ రాజా, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు పోతుపెద్ది కిషన్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వనం రాంచందర్‌రావు, గుజ్జుల రాజిరెడ్డి, చెలకల ఆశోక్‌తో పాటు తదితరులు పాల్గోన్నారు.