వాటర్ మ్యాన్ కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర మహిళా మహిళ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి

జనం సాక్షి /కొల్చారం మండలం  సంగాయిపేట గ్రామపంచాయతీ లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగి సుధాకర్, విద్యుత్ షాక్ తో మరణించడంతో నేడు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, సుధాకర్,కుటుంబాన్ని పరామర్శించారు. నిరుపేద కుటుంబం కావడంతో సుధాకర్ పైనే ఆధారపడి జీవిస్తున్న కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె అన్నారు ప్రభుత్వం తరఫున కుటుంబాన్ని ఆదుకుంటామని సునీత లక్ష్మారెడ్డి,తెలిపారు సుధాకర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సునీత లక్ష్మారెడ్డి,వెంట గ్రామ సర్పంచ్ మానస,మెదక్ మార్కెట్ కమిటీ వైస్  చైర్మన్ సావిత్రి ,  నాయకులు శ్రీనివాస్ రెడ్డి,సంతోష్ కుమార్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.