వాణి పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో ఏజెన్సీ లో ని ఆణిముత్యాలకు అభినందన సన్మానం.
విద్యార్థులు బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయాలి….. వాణి పబ్లిక్ స్కూల్ కరస్పడెంట్ జంగేటి రాజు
జూలై16(జనం సాక్షి):-
ములుగు సర్వాపూర్ శనివారం రోజున వాణి పబ్లిక్ స్కూల్ ఆవరణలో ఏజెన్సీ లోని చదివిన మరియు ఇదే స్కూల్ లో చదివిన పూర్వ విద్యార్థులు ఇటీవల నిర్వహించిన పాలిసెట్ పలితాల్లో జిల్లా మొదటి ర్యాంక్ సాధించిన సర్వపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో నిలాలయ్య గూడెం గ్రామానికి చెందిన జాడి రేవంత్( 566)(ఎస్సి)మరియు రాయినిగూడెం గ్రామానికి చెందిన ఎర్రవెల్లి వైష్ణవి( 700)జిల్లా మూడో ర్యాంక్ సాధించారు.అలాగే పంచోతూకులపల్లి గ్రామానికి చెందిన మాలోతు యస్వంత్ నాయక్.పదవ తరగతిలో 10/10. మొదటి స్థానం.. అలాగే 9.8. మార్కులతో రెండో స్థానం సాధించిన బిక్కినేని అక్షయా (సర్వాపూర్) లను ఘనంగా సన్మానం చేయడం జరిగింది.
ఈ సందర్బంగా జరిగిన అభినందన సభలో పెగడపల్లి సర్పంచ్ బద్దుల లక్ష్మి ముఖ్య అతిథి గా హాజరై మాట్లాడుతూ క్రమశిక్షణ తో చదివి భవిష్యత్తు కు పునాదులు వేయాలని అన్నారు.వాణి పబ్లిక్ స్కూల్ కరస్పండెంట్ జంగేటి రాజు మాట్లాడుతూ పట్టుదల తో చదివి ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఉన్నత స్థాయి కి ఎదిగి సమాజానికి ఉపయోగపడాలని తల్లి దండ్రులు కన్నా కలలు నిజం చేయాలనీ అన్నారు. గత 23 సంవత్సరాలనుండి దాదాపు 900 మందికి పైగా విద్యార్థులను తీర్చిదిద్దడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమం లో సర్వాపూర్ పంచాయతీ కార్యదర్శి పత్రీ శ్రీధర్,వజ్జ, రాజు,సోషల్ వర్కర్ గుండెబోయిన రవిగౌడ్,ఆవుల ఐలయ్య,అప్పాజీ ఐలయ్య,సార స్వామి,శ్రీహరి గౌడ్,రామన్న,కొండల్ రావు, తిరుపతి,రాము సంపత్,శంకర్ రావు, శ్రీనివాస్,నర్సింహులు స్కూల్ టీచర్స్ తదితరులు 50 మంది పాల్గొన్నారు.
Attachments area