వాన..వాన.. వలప్ప

` తడిచిముద్దైన తెలంగాణ
` వర్షలతో పొంగిపొర్లుతున్న వాగులు వంకలు
` వరంగల్‌,ఆదిలాబాద్‌ జిల్లాల్లో దంచికొడుతున్న వానలు
` ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలకు అత్యంత భారీవర్ష సూచన
` శ్రీశైలం, సింగూరు, కొమురంభీం జలాశయాల గేట్లు ఎత్తివేత
` భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి
` కిన్నరసానికి భారీగా వరదనీరు చేరిక
హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు భారత వాతావరణ విభాగం ఐఎండీ రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో భారీవర్షాలు కురుస్తున్నాయి. వారం రోజులుగా కురిసిన వర్షాలకు వాగులు.. వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఉద్యోగస్తులు వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నారు. అవపరమైతే తప్ప జనాలను బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాలకు ఐఎండీ రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. మరో పదకొండు జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసి.. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని తెలిపింది. ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో 3రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడిరచింది. ఇదిలావుంటే ఆదిలాబాద్‌ జిల్లాలో కుండపోతగా వర్షం కురుస్తున్నది. జిల్లాలోని పలు జిల్లాల్లో శనివారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపిలేకుండా వాన పడుతున్నది. దీంతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తు న్నాయి. సిరికొండ మండలం లో చికమాగన్‌ వాగు ఉప్పొంగింది. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నార్నూర్‌, గాదిగూడ మండలాల్లో లోతట్టు ప్రాంతాలు, పంట పొలాలలో వర్షపునీరు చేరి జలమయమయ్యాయి. గాదిగూడ మండలంలోని ఖడ్కి, లోకారికే, అర్జుని, దాబా, మేడిగూడ, చిత్తగూడ, నార్నూర్‌లోని బాబేరaరి ప్రధాన రహదారులపై లో లేవల్‌ కల్వర్టులపై వరద నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిరది. భారీ వర్షానికి ఉమ్మడి మండలంలోని జనం ఇండ్లకే పరిమితమయ్యారు. అత్యవసర సమయంలోనే బయటికి రావాలని, సమస్యలుంటే నేరుగా సంబంధిత శాఖ లేదా డయల్‌ 100కి సమాచారం అందించాలని నార్నూర్‌ సీఐ పేందూర్‌ ప్రభాకర్‌ తెలిపారు. ఉట్నూరు మండలం దంతనపల్లి వద్ద రోడ్డుపై చెట్లు- కూలిపడిపోయింది. దీంతో ఉట్నూరు నుంచి జన్నారం వైపు రాకపోకలు నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా మెదక్‌ జిల్లాలో సింగూరు ప్రాజెక్ట్‌ కు భారీగా వరద చేరడంతో గేట్లు- ఎత్తారు. వరద తాకిడితో ఏడుపాయల వనదుర్గా అమ్మవారి దేవాలయాన్ని మూసేశారు. మెదక్‌ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా మాత ఆలయాన్ని పూజారులు, అధికారులు మూసివేశారు. సింగూరు ప్రాజెక్టు గేట్లు- ఎత్తడంతో అమ్మవారి ఆలయం వద్ద మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ఉధృతి తగ్గిన తర్వాత ఆలయాన్ని తెరుస్తామని అధికారులు తెలిపారు. అప్పటి వరకూ రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతాయని వెల్లడిరచారు. ఏటా భారీ వరద పో-టె-త్తడంతో అమ్మవారి ఆలయాన్ని ఇలా మూసివేస్తారు.
భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి
గోదావరి పరివాహకంలో కురుస్తున్న వర్షాలతో భద్రాచలం(ఇఠశసశ-ఠశశెప) వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. నీటిమట్టం శుక్రవారం ఉదయం 6 గంటలకు 23.6 అడుగులకు చేరింది. 12 గంటలకు 25.4, 4గంటలకు 26.3అడుగులకు చేరగా.. రాత్రికి 28 అడుగుల వరకు చేరే అవకాశం ఉన్నట్టు- అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా భద్రాచలం గోదావరి స్నానఘట్టాలపై నుంచి నీరు ప్రవహిస్తోంది. భక్తులు, పర్యాటకులకు తెలిసేందుకు ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు- చేశారు. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరదనీరు చేరుతోంది. 404.70 అడుగులకు నీటి మట్టం పెరిగింది. మహబూబాబాద్‌ జిల్లాలోని పాకాల కొత్తగూడం నుంచి గుండాల, ఇల్లెందు, టేకులపల్లి, కొత్తగూడెం అటవీ ప్రాంతాల నుంచి జలాశయానికి 1,700 క్యూసెక్కుల చొప్పున నీరు చేరడంతో డ్యాం అధికారులు అప్రమత్తమయ్యారు. డ్యాం సామర్థం 407 అడుగులు కాగా 404.70 అడుగులకు నీరు చేరడంతో లోతట్టు- ప్రాంతాల ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. జలాశయం దిగువ ప్రాంతం లో ఉన్న లోతట్టు- గ్రామాల ప్రజలు వాగులు దాటొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా భారీవర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు
ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్నాయి. వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీవర్షానికి వాగులు పొంగి రోడ్డుపై ప్రవహిస్తుండటంతో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి.ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో కురిసిన భారీ వర్షానికి వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. మల్లపురం, సీతారాంపురం, కలిపాక వాగులు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి.జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని పెగడపల్లి, కేశపూర్‌ గ్రామాల మధ్య ఉన్న పెద్దవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కాటారం-మేడారం రహదారిపై వాహనాల రాకపోకలు సాగడం లేదు. మేడారం సహా మండలంలోని 16 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.