వామపక్షాల నాయకులను ముందస్తు అరెస్ట్

టేకులపల్లి, నవంబర్ 12( జనం సాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా టేకులపల్లి మండలంలో వామపక్షాల నాయకులను శనివారం టేకులపల్లి పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా జిల్లా సిపిఐ పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు రాంచందర్, సిపిఎం మండల కార్యదర్శి కడుదుల వీరన్న మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనలో భాగంగా వామపక్షాల నాయకులనుఅక్రమంగా అరెస్టులు చేయడం హేయమైన చర్యని వారు తీవ్రంగా ఖండించారు. విభజన చట్టానికి తూట్లు పోడుస్తు,తెలంగాణకు అన్యాయం చేస్తూ పౌర హక్కులను కాలరాస్తున్న మోడీకి స్వాగతం ఎలా పలుకుతారని, బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, కేంద్ర విద్యాలయాల కోసం మోడీపై పోరాటం ఇంకా ఉదృతం చేయాలని, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, దేశంలో గిరిజన జనాభా నిష్పత్తి ప్రకారం 10 శాతానికి రిజర్వేషన్ పెంచాలని, ముఖ్యంగా బయ్యారం ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని తదితర డిమాండ్లపై సిపిఐ, సిపిఎం పార్టీల పిలుపుమేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగే నల్ల బ్యాడ్జిలతో నిరసన కార్యక్రమాన్ని అడ్డుకున్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు ఎజ్జు భాస్కర్,అయితా శ్రీరాములు, బానోత్ వీరన్న లను అరెస్టు చేశారు.

తాజావార్తలు