వామపక్ష విద్యార్థి సంఘాల బంద్ విజయవంతం.

ఎస్ఎఫ్ఐ  – ఏఐఎస్ఎఫ్  – ఏఐఎఫ్డిఎస్ -. పిడిఎస్యు కమిటీల ఆధ్వర్యంలో.
తొర్రూర్ 20జూలై ( జనంసాక్షి )
వామపక్ష విద్యార్థి సంఘాల బంద్ విజయవంతమైందని . వామపక్ష విద్యార్థి సంఘ నాయకులు అన్నారు. అనంతరం  ప్రభుత్వ పాఠశాల బంద్ చేసే కార్యక్రమంలో  ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు లవిశెట్టి ప్రసాద్ , ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి సాయి కిరణ్  , పి డి ఎస్ యు  డివిజన్ అధ్యక్షుడు డేవిడ్ , ఏఐఎఫ్డిఎస్ జిల్లా నాయకులు అరుణ్ నాయక్   మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేజీ టు పీజీ ఉచిత విద్య అమలు చేస్తా అని చెప్పిన మాటలను తుంగలో తొక్కారని అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు గడిచిన కనీసం సరైన తరగతి గదులు లేవని ప్రస్తుత కాలానికి అనుకూలంగా మధ్యాహ్న భోజనం బిల్లులు పెంచకపోవడం వల్ల విద్యార్థులకు సరైన పౌష్టికాహారం అందించడంలో విఫలమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు , కార్పొరేట్ విద్యను వ్యతిరేకించాల్సింది పోయి ప్రభుత్వమే కార్పొరేట్ విద్యా సంస్థలకు పర్మిషన్లు ఇవ్వడం సిగ్గుచేటని వెంటనే కార్పొరేట్ విద్యా వ్యవస్థను వ్యతిరేకించాలని వారు అన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని రెగ్యులర్ ఎంఈఓ లను నియమించాలని కోపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి మాలోతు సురేష్ బాబు  డివిజన్ నాయకులు వెంకటేష్  మార్క శివ ప్రసాద్  మండల కార్యదర్శి  ఎండి అమీర్ ,  , ఏఐఎస్ఎఫ్ నాయకులు  నవీన్  , పిడిఎస్యు నాయకులు యశ్వంత్ , సాయికుమార్  , సంతోష్ , వెంకన్న తదితర  నాయకులు పాల్గొన్నారు.