వాయిదాలో మొదలైన పార్లమెంట్ సమావేశాలు
రాజ్యసభ నేటికి…లోక్‌సభ మధ్యాహ్నానికి వాయిదా
రాజ్యసభలో కొత్త సభ్యుల ప్రమాణం
వివిధ అంశాలపై చర్చకు విపక్షల పట్టుతో సభ వాయిదా
న్యూఢల్లీి,జూలై18(జనంసాక్షి): పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే వాయిదాలతో మొదలయ్యాయి. తొలిరోజు గందరగోళం మధ్య ఉబయసభలు వాయిదా పడ్డాయి. ఎగువసభ రాజ్యసభలో కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. ధరల పెరుగుదలపై కాంగ్రెస్ ఎంపీల ఆందోళనల నడుమ రాజ్యసభ మంగళ వారానికి వాయిదా పడిరది. ధరల పెరుగుదల, జీఎస్టీ రేట్ల పెంపుపై కాంగ్రెస్ ఎంపీల ఆందోళనల నడుమ.. రాజ్యసభ వాయిదా పడిరది. దీంతో.. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజే సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. అంతకుముందు.. కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు ప్రమాణం చేశారు. వారు ప్రమాణం చేసి వెళ్లేలా రాజ్యసబ ఛైర్మన్ వెంకయ్యనాయుడు వారికి తగు సూచనలు చేశారు. ఎపికి చెందిన విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావులతో పాటు, రాజీవ్ శుక్లా, విూసా భారతి, ప్రఫుల్ పటేల్, హర్భజన్‌సింగ్, విజయేందప్రసాద్ ప్రమాణస్వీకారం చేశారు. తర్వాత.. ఛైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. విపక్షాల ఆందోళనతో రాజ్యసభ మంగళవారానికి వాయిదా పడిరది. అగ్నిపథ్, జీఎస్టీ పన్నులపై విపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. రాజ్యసభ చైర్మన్ పోడియం ఎదుట విపక్ష ఎంపీలు నిరసనకు దిగారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష ఎంపీల నినాదాలు చేశారు. ప్రజాసమస్యలపై మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యసభలో అగ్నిపథ్‌పై చర్చకు విపక్షాల వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. రూల్ 267 కింద సీపీఐ, కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీలు బినోయ్ విశ్వం, శక్తిసిన్హ్ గోహిల్ వాయిదా తీర్మానాలు ఇచ్చారు. అగ్నిపథ్ పథకంపై చర్చకు డిమాండ్ చేశారు. దీంతో.. కొందరు కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారని, అలాగే రాష్ట్రపతి ఎన్నికలోనూ ఓటేసేందుకు వీలుగా సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు వెంకయ్య ప్రకటించారు. సోమవారం సభ ప్రారంభమైన తర్వాత.. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే, యూఏఈ మాజీ అధ్యక్షుడు షేక్ ఖలీఫాకు సభలో నివాళి అర్పించారు లోక్‌సభ కూడా ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడిరది. ఎంపీలు రాష్ట్రపతి ఎన్నికల్లో భాగస్వామ్యం అయ్యేలా మధ్యాహ్నం 2 గంటలకు స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు. ధరల పెరుగుదలపై అటు లోక్‌సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. సిలిండర్, పెట్రో ఉత్పత్తుల ధరల పెంపుపై చర్చకు కాంగ్రెస్ పట్టుబట్టింది. పార్లమెంట్ ఆవరణలో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ జరుగుతున్నందునా.. మధ్యాహ్నం రెండు గంటల వరకు లోక్‌సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్ ఓం బిర్లా. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మొత్తం 32 బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాల్లోనే తెలంగాణ గిరిజన సెంట్రల్ యూనివర్సిటీ బిల్లు ప్రస్తావనకు రానుంది.