వాయుగుండంగా మారిన అల్పపీడనం
మరో 24 గంటలపాటు వర్షసూచన
విశాఖపట్నం,ఆగస్ట్16(జనం సాక్షి ): రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా-ఉత్తర తెలంగాణకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ గురువారం వెల్లడించింది. వాతావరణశాఖ అధికారులు మాట్లాడుతూ..బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని తెలిపారు. ఒడిశా తీరంపై భువేనేశ్వర్‌కు ఆగేయంగా 30 కి.విూ దూరంలో వాయుగుండం కేంద్రీకఅతమై ఉందని, కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కి.విూ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయని చెప్పారు. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు