వాళ్ళు ఎక్కడికి పోరు

మన హృదయ ద్వారాల్లో చిరకాలం నిలిచిపోతారు
మన గుండెల్లో అమరులు అవుతారు
మన విలువలకు ఒక జ్ఞాన తోరణం అవుతారు
నిత్య తేజ వంతులు
మనలో లోపల వారి మంచి పనులన్నీ సుడిగాలిలా తిరుగుతూనే ఉంటాయి
వాళ్లు ప్రపంచానికి వెలుగు దీపాలను అందించిన వాళ్లు
వాళ్లు ప్రకాశిస్తూనే ఉంటారు
ఆకాశంలో నీ నక్షత్రాల
వినీలాకాశంలోని చందమామల
చల్లని చలువ పందిర్లు వేసిన కాంతి కెరటాలు
ప్రజలే సమస్తమని ప్రజల సౌభాగ్యమే తన లక్ష్యమని జీవించిన వాళ్ళు
వాళ్లే నిజమైన దేశభక్తులు ప్రజలే సర్వస్వమని నమ్మిన వాళ్లు
ఇల్లు వాకిళ్లు వదిలిపెట్టి ప్రజలే జీవన సంసారం అని సాగిన మహా ఆదర్శమూర్తులు త్యాగజీవులు
వాళ్ళు ఎప్పుడూ ప్రజల మనసుల్లో
తరగని ముద్రలు వేసి జ్ఞాపకాలుగా మిగిలిపోయారు
వాళ్ళు ఎప్పుడూ ప్రజల గుండెలో శాశ్వతమైన జీవన చిత్రాల నక్షత్రాలు
డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు ఖమ్మం భువనగిరి కోట 7702537453