వాషింగ్టన్‌లో మంత్రి కేటీర్ బిజీబిజీ
– ఏరోస్పేస్ రంగంలో యువతకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధిపై చర్చ
-యునైటెడ్ స్టేట్స్ ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీతో చర్చ
– తొలిరోజు పర్యటన విజయవంతం
వాషింగ్టన్,అక్టోబర్ 13(జనంసాక్షి): తెలంగాణ ఐటి శాఖమంత్రి కల్వకుంట్ల తారక రామారావు అమెరికా పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. పలువురు ప్రముఖులు, పలు కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమయ్యారు. పెట్టుబడుల సేకరణే లక్ష్యంగా అమెరికా వెళ్లిన తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి కేటీఆర్… వాషింగ్టన్ లో పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రముఖులతో సమావేశమయ్యారు. అమెరికాలో భారత రాయబారి తరుణ్‌జిత్‌సింగ్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ, అమెరికా రాష్ట్రాల్లోని పలు రాష్ట్రాల మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాల పెంపు కోసం సహకరించాలని కోరారు. అమెరికా కాన్సుల్ జనరల్‌గా నియమితులైన కేథరిన్ బి హద్దాను కూడా మంత్రి కేటీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ నుంచి వచ్చే విద్యార్థులు, వారి సమస్యలను చర్చించారు. బోయింగ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ బెర్ట్రాండ్ మార్క్‌ను కేటీఆర్ కలిశారు. హైదరాబాద్ ఏరోస్పేస్ సిటీలోని బోయింగ్ సంస్థకు సహకారంపై బెర్ట్రాండ్ మార్క్ హర్షం వ్యక్తం చేశారు. ఏరోస్పేస్ రంగంలో యువతకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధిపై ఇరువురితో చర్చించారు. నగరంలోని ఏరో స్పేస్ సిటీలో ఉన్న బోయింగ్ సంస్ధకు ప్రభుత్వ సహకారంపై మార్క్ హర్షం వ్యక్తం చేశారు. ఏరో స్పేస్ రంగంలో విద్యార్థులు, యువతకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై మార్క్‌తో కేటీఆర్ చర్చలు జరిపారు. యునైటెడ్ స్టేట్స్ ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. కాలుష్యాన్ని తగ్గిస్తూ అంతర్జాతీయ పర్యావరణ ప్రమాణాలతో రాష్ట్రం ముందుకు వెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. హైదరాబాద్‌లోని ఫార్మా కంపెనీలను ఔటర్‌రింగ్‌రోడ్డు అవతలకు ఫార్మాసిటీలోకి తరలించే ప్రయత్నాలను ఈ సందర్భంగా కేటీఆర్ వారి దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంలో ప్రభుత్వానికి మార్గదర్శకాల రూపకల్పనలో సహకరించేందుకు యునైటెడ్ స్టేట్స్ ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ముందుకువచ్చింది. అమెరికా ఫార్మా సదస్సులోనూ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ప్రముఖ ఫార్మా కంపెనీలు పైజర్, ఏలీ లీలీ, అలెక్సియన్ మెర్క్, అమ్జెన్ కంపెనీల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానం, ఫార్మాసిటీ గురించి కేటీఆర్ వారికి వివరించారు. ఫార్మా పెట్టుబడులపై దృష్టి సారించిన మంత్రి… అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ ప్రతినిధుల బృందంతో సమావేశమయ్యారు. కాలుష్యాన్ని తగ్గిస్తూ అంతర్జాతీయ పర్యావరణ ప్రమాణాలతో రాష్ట్రం ముందుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించిన కేటీఆర్… హైదరాబాద్ లోని ఔషధ కంపెనీలను ఔటర్ రింగ్ రోడ్ వెలుపలకు, ఫార్మాసిటీలోకి తరలించే ప్రయత్నాలను వివరించారు. ఇందుకోసం మార్గదర్శకాల రూపకల్పనలో ప్రభుత్వానికి సహకరిస్తామని ప్రతినిధులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానం, ఫార్మాసిటీ వివరాలను వివరించారు. క్లీవ్ లాండ్ మెటార్ సైకిల్ వర్క్ కంపెనీ సీఈఓ జోనాథన్ తో సమావేశమై రాష్ట్రంలో తయారీ యూనిట్ నెలకొల్పాలని కోరారు. కమ్యూనిక్లిక్ సంస్ధ ప్రతినిధి రామ్ రెడ్డితోనూ భేటీ అయ్యారు. హైదరాబాద్ లో తమ సంస్ధ విభాగాన్ని ప్రారంభించేందుకు ఆయన ముందుకొచ్చారు. 2017 గ్లోబల్ ఎంటర్ ప్య్రూనర్ షిప్ సమ్మిట్ డైరెక్టర్ టామ్ లెర్సస్టెన్ తో సమావేశమైన కేటీఆర్… సదస్సు నిర్వహణకు హైదరాబాద్ అత్యుత్తమ ప్రదేశమని తెలిపారు. నగరంలో సదస్సు నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని హావిూ ఇచ్చారు.హైదరాబాద్ లో అమెరికా కాన్సుల్ జనరల్ గా నియమించబడిన కేథరిన్ బి హడ్డా మంత్రి కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ నుంచి వచ్చే విద్యార్థులు, వారి సమస్యలను మంత్రి ఆమెతో చర్చించారు.ప్రసిద్ధ విమాన తయారీ సంస్థ బోయింగ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ బెర్ట్రాండ్ మార్క్ అలెన్ మంత్రి కేటీఆర్ ని కలిశారు. హైదరాబాద్ నగరంలోని ఏరో స్పేస్ సిటీలో ఉన్న బోయింగ్ సంస్థకు ప్రభుత్వ సహకారం అందుతున్న తీరుపైన ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఏరో స్పేస్ రంగంలో విద్యార్థులు, యువతకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపైన ఇరువురు చర్చించారు.ఈసారి పర్యటనలో మంత్రి ఫార్మరంగ పెట్టుబడుల విూద దృష్టి సారించిన నేపథ్యంలో అమెరికాలోని పలు సంస్థల ప్రతినిధులతో సమావేశం అవ్వనున్నారు. అందులో మొదట యునైటెడ్ స్టేట్స్ ఎన్విరాన్ మెంటల్ ప్రొటెక్షన్ ఏజన్సీ ప్రతినిధుల బృందంతో సమావేశం అయ్యారు. కాలుష్యాన్ని తగ్గిస్తూ, అంతర్జాతీయ పర్యావరణ ప్రమాణాలతో రాష్ట్రం ముందుకు వెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యల విూద చర్చించారు.నగరంలోని ఫార్మ కంపెనీలను ఔటర్ రింగ్ రోడ్డు అవతలకు, ఫార్మసీటీలోకి తరలించే ప్రయత్నాలను ఈ సందర్భంగా మంత్రి చర్చలో ప్రస్తావించారు. ఈ విషయంలో ప్రభుత్వానికి మార్గదర్శకాల రూపకల్పనలో సహకరించేందుకు యుఎస్‌ఈపీఏ ముందుకు వచ్చింది.అమెరికాలోని ప్రసిద్ధ ఫార్మ కంపెనీలైన ఫైజర్, ఏలీ లీలీ, అలెక్సియన్, మెర్క్, అమ్జెన్ వంటి సంస్థలు పాల్గొన్న ఫార్మస్యుటికల్ రీసెర్చ్ అండ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఆఫ్ అమెరికా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ప్రభుత్వ పారిశ్రామిక విధానం, ఫార్మాసిటీ వంటి ప్రధానమైన అంశాలను వారికి వివరించారు.ఆ తర్వాత క్లీవ్ లాండ్ మోటార్ సైకిల్ వర్క్ కంపెనీ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ కంపెనీ సియివో జోనాథన్ తో సమావేశం అయిన మంత్రి, తెలంగాణలో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ నెలకొల్పే అంశాన్ని పరిశీలించాలని, పూర్తి సహకారం ప్రభుత్వం వైపు నుండి అందిస్తామని హావిూ ఇచ్చారు. కమ్యూనిక్లిక్ సంస్థకు చెందిన రాంరెడ్డితోనో మంత్రి సమావేశం అయ్యారు. హైదరాబాద్ లో తమ సంస్థ విభాగాన్ని ప్రారంభించేందుకు రాంరెడ్డి ముందుకు వచ్చారు.గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్-2017 నిర్వహకులు (డైరెక్టర్ టామ్ లెర్సస్టెన్) తో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ సమావేశాన్ని హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తే పూర్తి సహకారం అందిస్తామని, ఈ సమావేశానికి నగరమే అత్యుత్తమ ప్రదేశమని తెలిపారు.ఈ పర్యటనలో మంత్రి కేటీఆర్ వెంట ఇంధన, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఉన్నారు.