వాస్తవ బడ్జెట్‌

` సంక్షేమం, ఆరు గ్యారెంటీలు, వ్యవసాయం, అభివృద్ధికి పెద్దపీట
` అభివృద్ధి, సంక్షేమం జోడు గుర్రాలు
` గత బడ్జెట్‌ కంటే రూ.14వేల కోట్లే ఎక్కువ
` అవాస్తవ లెక్కలు చూపలేదు
` ఇసుక, జీఎస్టీ,మద్యం తదితరాలపై రాబటి పెంచుకుంటాం
` ప్రజలపై భారం మోపం
` పదేళ్లలో ట్రిలియన్‌ డాలర్లకు చేర్చడమే లక్ష్యం
` ఆరు గ్యారెంటీలు లక్ష్యంగా బడ్జెట్‌
` మహిళలతో రైస్‌ మిల్లులు, మినీ గోదాములు
` మద్యం ఆదాయంతోనే చక్కబెట్టే యత్నాలు
` రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ‘మెగా మాస్టర్‌ ప్లాన్‌ 2050’
` దేశానికే తలమానికంగా ఉండేలా ‘ఫ్యూచర్‌ సిటీ’
` బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క

(మొత్తం బడ్జెట్‌ పద్దు రూ. 3,04,965 కోట్లు
తలసరి ఆదాయం రూ.3,79,751 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు
మూల వ్యయం రూ.36,504 కోట్లు)

హైదరాబాద్‌(జనంసాక్షి): ఆరు గ్యారెంటీలకు భారీగా కేటాయింపులు చేస్తూనే….అభివృద్ది, సంక్షేమం లక్ష్యంగా భట్టి బడ్జెట్‌ను వండి వార్చారు. ఆయా రంగాలకు ఉన్నంతలో కేటాయింపులు చేశారు. ప్రధానంగా కేటాయింపుల్లో మహిళలకు పెద్దపీట వేశారు. రాష్టాన్న్రి అగ్రగామిగా నిలిపేందుకు మెగా మాస్టర్‌ ప్లాన్‌ 2050 రూపొందించాం. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పదేళ్లలో ట్రిలియన్‌ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా కార్యాచరణ చేపడుతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించాలనుకుంటున్న ఫ్యేచర్‌ సిటీకి మాత్రం కేవలం వంద కోట్లే కేటాయిచడం విశేషం. దీంతో ఎలా ముందుకు పోతారో చెప్పలేక పోయారు. ఇకపోతే ఆదాయంలో ప్రధాన వనరు మద్యం అమ్మకాలే కావడం విశేషం. తెలంగాణ బడ్జెట్‌ రూ.3,04,965 కోట్లు- కాగా.. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు- ఉందన్నారు. ఇక, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా ఉందని పేర్కొన్నారు. బడ్జెట్‌ ప్రవేశ పెడుతూ..డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్నింటిలో మహిళకు తొలి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. మహలక్ష్మీ పథకం కింద బస్సులో ఉచిత ప్రయాణానికి రాష్ట్ర మహిళలకు రూ.5,005 కోట్లు- ఆదా అవుతుందని చెప్పుకొచ్చారు. అలాగే, ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకం ద్వారా 433 కోట్ల రూపాయలను మహిళలు ఆదా చేసుకుంటు న్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అంతేగాక ఇందిరమ్మ ఇళ్లు మహిళల పేరుపై మంజూరుకు తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని చెప్పుకొచ్చారు. ఇక, మహిళలకు ఉద్యోగ అవకాశాల్లో కూడా దేశంలోనే అత్యధిక శాతం మన రాష్ట్రమే అవకాశాలు కల్పిస్తున్నదని వెల్లడిరచారు. తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మి అధికారం కట్టబెట్టారు. ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ పాలన సాగిస్తున్నాం. గత ప్రభుత్వ పాలనలో ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం. తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నాం. కొందరు దుష్పచ్రారమే పనిగా పెట్టుకున్నారు. ప్రభుత్వ ప్రతి చర్యనూ నిందిస్తూ ఆరోపణలు చేస్తున్నారు. గత ప్రభుత్వం 2 పడక గదుల ఇళ్లు ఇస్తామని ప్రజలకు నిరాశ మిగిల్చింది. చైనా ప్లస్‌ వన్‌ వ్యూహంతో రాష్టాన్న్రిగ్లోబల్‌ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. ప్రతి మండలంలో మహిళలతో రైస్‌ మిల్లులు, మినీ గోదాములు ఏర్పాటు- చేస్తాం. ఐకేపీ కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని మహిళా రైస్‌ మిల్లుల్లో మిల్లింగ్‌ చేయిస్తాం. ఆ బియ్యాన్ని ఎఫ్‌సీఐకి సరఫరా చేసే బాధ్యతను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తాం. మండల మహిళా సమాఖ్యల ద్వారా ఆర్టీసీకి అద్దెకు 600 బస్సులు కేటాయిస్తాం. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చట్టాన్ని అమలు చేస్తున్న మొదటి రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఓఆర్‌ఆర్‌ ఫేజ్‌-2 నీటి సరఫరా ప్రాజెక్టు చివరి దశకు చేరుకుంది. ఫేజ్‌-2 ద్వారా హెచ్‌ఎండీఏలో విస్తరించిన ప్రాంతాలకు తాగునీరు అందిస్తాం. హైదరాబాద్‌లో సమగ్ర వరద నీటిపారుదల ప్రాజెక్టుకు రూ.5,942 కోట్లు- కేటాయిస్తాం. దేశానికి తలమానికంగా ఉండేలా ఫ్యూచర్‌ సిటీని రూపొందిస్తున్నాం. శ్రీశైలం- నాగార్జునసాగర్‌ రహదారుల మధ్య ఇది ఉంటుంది. 56 గ్రామాలు, 765 చదరపు కి.విూ విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఫ్యూచర్‌ సిటీ-లో ఏఐ సిటీ-, ఫార్మా హబ్‌, స్పోర్ట్స్‌ సిటీ-, క్లీన్‌ ఎనర్జీ, ఇన్నోవేషన్‌ జోన్లు, మల్టీ మోడల్‌ కనెక్టివిటీ-, ఎలక్ట్రిక్ర్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఉంటాయి. ఈ ప్రాజెక్టును ఎఫ్‌సీడీఏ పర్యవేక్షిస్తుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బడ్జెట్‌లో వివిధ రంగాలకు కేటాయింపులిలా ఉన్నాయి. పంచాయతీరాజ్‌ శాఖ- రూ.31,605 కోట్లు, వ్యవసాయశాఖ- రూ.24,439 కోట్లు, విద్యాశాఖ- రూ.23,108కోట్లు,మహిళా శిశుసంక్షేమశాకు రూ.2,862 కోట్లు,పశు సంవర్థకశాఖ- రూ.1,674 కోట్లు,పౌరసరఫరాల శాఖ- రూ.5,734కోట్లు,కార్మికశాఖకు రూ.900 కోట్లు,ఎస్సీ సంక్షేమం: రూ40,232 కోట్లు,ఎస్టీ సంక్షేమం- రూ.17,169 కోట్లు, బీసీ సంక్షేమం కోసం 11,405 కోట్లు కేటాయించారు. ఇకపోతే చేనేత రంగానికి- రూ.371 కోట్లు, మైనార్టీ సంక్షేమశాఖ- రూ.3,591 కోట్లు, పరిశ్రమలశాఖ- రూ.3,527 కోట్లు, ఐటీ- రంగం- రూ.774 కోట్లు, విద్యుత్‌ రంగం- రూ.21,221 కోట్లు, వైద్య రంగం- రూ.12,393 కోట్లు,పురపాలక రంగం- రూ.17,677 కోట్లు,నీటి పారుదలశాఖ- రూ.23,373 కోట్లు,రోడ్లు, భవనాల శాఖ- రూ.5,907 కోట్లు,పర్యాటక రంగం- రూ.775 కోట్లు,క్రీడలు- రూ.465 కోట్లు,అటవీ, పర్యావరణం- రూ.1,023 కోట్లు, దేవాదాయశాఖ- రూ.190 కోట్లు కేటాయించారు. ఆరు గ్యారంటీలకు- రూ.56,084 కోట్లు, రైతు భరోసా- రూ.18వేల కోట్లు,చేయూత పింఛన్లు రూ.14,861 కోట్లు, ఇందిరమ్మ ఇళ్లు రూ.12,571 కోట్లు, మహాలక్ష్‌మి పథకానికి రూ.4,305 కోట్లు,గృహజ్యోతి- రూ.2,080 కోట్లు,సన్నాలకు బోనస్‌ రూ.1,800 కోట్లు, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ- రూ.1,143 కోట్లు,గ్యాస్‌ సిలిండర్‌ రాయితీ- రూ.723 కోట్లు,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా- రూ.600 కోట్లు,రాజీవ్‌ యువ వికాసం- రూ.6వేలకోట్లు,ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించారు.

 

బడ్జెట్‌లో వివిధ రంగాలకు కేటాయింపులిలా..
పంచాయతీరాజ్‌ శాఖ- రూ.31,605 కోట్లు
వ్యవసాయశాఖ- రూ.24,439 కోట్లు
విద్యాశాఖ- రూ.23,108కోట్లు
మహిళా శిశుసంక్షేమశాఖ- రూ.2,862 కోట్లు
పశు సంవర్థకశాఖ- రూ.1,674 కోట్లు
పౌరసరఫరాల శాఖ- రూ.5,734కోట్లు
కార్మికశాఖ- రూ.900 కోట్లు
ఎస్సీ సంక్షేమం: రూ40,232 కోట్లు
ఎస్టీ సంక్షేమం- రూ.17,169 కోట్లు
బీసీ సంక్షేమం- 11,405 కోట్లు
చేనేత రంగానికి- రూ.371 కోట్లు
మైనార్టీ సంక్షేమశాఖ- రూ.3,591 కోట్లు
పరిశ్రమలశాఖ- రూ.3,527 కోట్లు
ఐటీ రంగం- రూ.774 కోట్లు
విద్యుత్‌ రంగం- రూ.21,221 కోట్లు
వైద్య రంగం- రూ.12,393 కోట్లు
పురపాలక రంగం- రూ.17,677 కోట్లు
నీటి పారుదలశాఖ- రూ.23,373 కోట్లు
రోడ్లు, భవనాల శాఖ- రూ.5,907 కోట్లు
పర్యాటక రంగం- రూ.775 కోట్లు
క్రీడలు- రూ.465 కోట్లు
అటవీ, పర్యావరణం- రూ.1,023 కోట్లు
దేవాదాయశాఖ- రూ.190 కోట్లు
ఆరు గ్యారంటీలు- రూ.56,084 కోట్లు
రైతు భరోసా- రూ.18వేల కోట్లు
చేయూత పింఛన్లు రూ.14,861 కోట్లు
ఇందిరమ్మ ఇళ్లు రూ.12,571 కోట్లు
మహాలక్ష్మి పథకానికి రూ.4,305 కోట్లు
గృహజ్యోతి- రూ.2,080 కోట్లు
సన్నాలకు బోనస్‌ రూ.1,800 కోట్లు
రాజీవ్‌ ఆరోగ్యశ్రీ- రూ.1,143 కోట్లు
గ్యాస్‌ సిలిండర్‌ రాయితీ- రూ.723 కోట్లు
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా- రూ.600 కోట్లు
రాజీవ్‌ యువ వికాసం- రూ.6వేలకోట్లు
ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధికి రూ.100 కోట్లు

ఢల్లీికి మూటలు మోసేలా బడ్జెట్‌
` నెగిటివ్‌ పాలిటిక్స్‌ వల్ల ఆదాయం తగ్గిపోయింది:కెటిఆర్‌
హైదరాబాద్‌(జనంసాక్షి): ఒక్క మాటలో ఈ బడ్జెట్‌ గురించి చెప్పాలంటే.. ఢల్లీికి మూటలు పంపే బడ్జెట్‌లా ఉందని అంటూ బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటిఆర్‌ విమర్శలు గుప్పించారు. నీ తెలివి తక్కువ తనం వల్ల, నెగిటివ్‌ పాలిటిక్స్‌ వల్ల ఆదాయం తగ్గిపోయిందని సిఎం రేవంత్‌ రెడ్డిని ఉద్దేశించి నేరుగా విమర్శలు చేశారు.విూడియా ముందు రంకెలు వేయడం కాదు.. అంకెలు ఎందుకు ఆగమాయ్యాయో చెప్పు. గత బడ్జెట్‌ సందర్భంగా చెప్పినట్లు విూ బడ్జెట్‌ అంచనాలకు ఎందుకు చేరుకోలేకపోయింది. నమ్మి ఓట్లేసిన పాపానికి 4 కోట్ల మందిని ముంచిన బడ్జెట్‌ ఇది అంటూ విమర్శలు చేశారు.. పదేండ్ల ప్రగతి రథచక్రానికి పంక్చర్‌ చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇది. రేవంత్‌ రెడ్డి అసమర్థతకు, చేతగానితనానికి నిలువుటద్దం ఈ బడ్జెట్‌. వీరి అసమర్థతత, చేతకాని తనం వల్ల ఆకాశం నుంచి పాతాళం వైపు ఆర్థిక వ్యవస్థ పోతున్నదంటే కచ్చితంగా బాధ్యత కాంగ్రెస్‌ పార్టీ తీసుకోవాలి. కేసీఆర్‌ ఏడాదికి రూ. 40 వేల కోట్ల అప్పు జేస్తే రంకెలు వేశారు. కానీ ఇవాళ ఒక్క ఏడాదికి లక్షా 60 వేల కోట్లు- అప్పు చేసి కొత్త ప్రాజెక్టు కట్టలేదు. ఒక్క ఇటు-క పేర్చలేదు. ఒక్క గ్యారెంటీ- కూడా పూర్తిగా అమలుకు నోచుకోలేదు. ఈ బడ్జెట్‌ను చూస్తుంటే లక్షల కోట్ల అప్పు టార్గెట్‌ కనబడుతున్నట్టు- ఉందని కేటీ-ఆర్‌ పేర్కొన్నారు. తొండ ముదిరితే ఊరసవెల్లి అవుతదని పెద్దలు చెబుతారు. కానీ ఊరసవెల్లి ముదిరితే రేవంత్‌ రెడ్డి అయితడని ఈబడ్జెట్‌ చూసిన తర్వాత అర్థమవుతుంది. సంక్షేమానికి సమాధి.. అభివృద్ధికి అడ్రస్‌ గల్లంతు.. ప్రజలకు ఇచ్చిన హావిూలకు ఘోరీ కట్టి.. పార్టీ కార్యకర్తలకు మాత్రం వీళ్ల అబ్బ సొత్తు.. పప్పుబెల్లం లాగా 6 వేల కోట్లు- పంచి పెడుతారట. కార్యకర్తలకు ఇస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. పప్పుబెల్లంలాగా పంచి పెడుతామంటే.. అది యువ వికాసం కాదు కాంగ్రెస్‌ వికాసం అయితది అని కేటీఆర్‌ మండిపడ్డారు.తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షడు కెటిఆర్‌ విమర్శలు గుప్పించారు. బడ్జెట్‌లో తెలంగాణ ఆడబిడ్డకు తీరని అన్యాయం చేశారని ఆయన అన్నారు. అసెంబ్లీ విూడియా పాయింట్‌ వద్ద మాట్లాడిన ఆయన కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీ-లు గోవిందా అని అర్ధమైందని పేర్కొన్నారు. ఏడాది దాటిన ఉద్యోగాల ఊసే లేదని.. బిఆర్‌ఎస్‌ హయాంలో వచ్చిన నోటిఫికేషన్లు తామే ఇచ్చినట్లు- కాంగ్రెస్‌ నేతలు చెప్పుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల్లో హావిూ ఇచ్చిన తులం బంగారం, మహిళలకు నెలకు రూ.2వేలు, రూ.4వేలు పెన్షన్లు ఇస్తామన్న పాతరేశారని మండిపడ్డారు. కులగణన సర్వే పేరుతో వెనుకబడిన వర్గాలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్‌ ఎజెండా నెరవేర్చాల్సిన సమయం 40 శాతం గడిచిపోయిందని గుర్తు చేశారు. ప్రభుత్వం అందమే సక్కగా లేదు కానీ.. అందాల పోటీ-లు పెట్టేందుకు సిద్ధమవుతున్నారని విమర్శించారు. రంకెలు కాదు రేవంత్‌ రెడ్డి.. అంకెలు ఎక్కడ పోయినాయి అని ప్రశ్నించారు. ఆకాశం నుంచి బడ్జెట్‌ పాతాళానికి పడిపోతుందని.. పాలన చేతకాని ప్రభుత్వం.. ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం అని అన్నారు.

 

అంకెల గారడీ
` ప్రజలను మరోసారి మోసం ప్రభుత్వం:కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి):అట్టహాసంగా ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుపై ప్రజలు ఆశలు వదులుకునేలా పద్దుల రూపకల్పన జరిగిందని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్‌పై కిషన్‌రెడ్డి స్పందించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అంకెల గారడీతో తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసిందన్నారు. ‘‘పదేళ్లపాటు భారాస రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అగాథంలోకి నెట్టేస్తే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరు రాష్ట్రాన్ని పెనంపై నుంచి పొయ్యిలోకి పడేసినట్టు చేసింది. గతేడాది బడ్జెట్‌ పెట్టినప్పుడు తొలి ఏడాదే కదా అని తప్పించుకున్నారు. 15 నెలలు పాలించిన తర్వాత కూడా ఆరు గ్యారంటీలు, 420 వాగ్దానాల అమలును పూర్తిగా విస్మరించారు. వివిధ ప్రాజెక్టులకు భారీగా ప్రకటనలు చేసినా.. కేటాయింపులు, ఆచరణ శూన్యమని ఈ బడ్జెట్‌ ద్వారా స్పష్టమైంది. అంకెల గారడీ ద్వారా మరోసారి తెలంగాణ ప్రజలను నిట్టనిలువునా మోసం చేసిన బడ్జెట్‌ ఇది. ఎన్నికల హామీలపై ప్రజలు ఆశలు వదులుకోవాలని బడ్జెట్‌ నిరూపించింది. ప్రభుత్వ ఆదాయం, రాబడిపై కనీస అవగాహన లేకుండా అంచనాలు రూపొందించారు’’ అని కిషన్‌రెడ్డి విమర్శించారు.