విఆర్ఏ ల సమస్య లపై ములుగు అదనపు కలెక్టర్ వైవీ గణేష్ కి వినతి పత్రం ఇచ్చిన విఆర్ఓ జేఏసి సంఘం
బ్యూరో,జూలై..(జనం సాక్షి):-
ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన విఆర్ఏ ల పే స్కేల్, వారసులకు ఉద్యోగాలు, ప్రమోషన్ జి.ఓ లు విడుదల చేయాలనీ మరియు విఆర్ఏ లను అటెండర్, నైట్ వాచ్ మాన్,స్వీపర్,డ్రైవర్, సెక్షన్ అసిస్టెంట్,కంప్యూటర్ ఆపరేటర్ అధికారుల వ్యక్తిగత
పనులకు వాడుకోవద్దని విన్నవిస్తూ రాష్ట్ర విఆర్ఏ ఐక్య కార్యాచరణ కమిటి పిలుపు మేరకు తేది 13 జూలై 2022 రోజు నుండి విఆర్ఏ జేఏసి పిలుపు మేరకు గ్రామాలలోనే విధులు నిర్వహిస్తామని తెలుపుటకు జులై 25 నుండి సమ్మెకు వెళ్తున్నామని తెలియజేస్తూ సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది.
2017 ఫిబ్రవరి 24 రోజున ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి విఆర్ఏ లను క్రమబద్ధీకరిస్తామని ప్రకటించారు.2020 సెప్టెంబర్ 09 న అసెంబ్లీల్ రెవెన్యు చట్టం చెస్తున్న సందర్భంగా విఆర్ఏ లందరికి పై స్కేల్ ఇస్తామని 55సం.లు నిండిన విఆర్ఏ ల స్థానంలో వారసులకు విఆర్ఏ ఉద్యోగం ఇస్తామని,అర్హత కలిగిన విఆర్ఏ లకు పదోన్నతి కల్పిస్తామని నిండు శాసన సభలో రెండుసార్లు ప్రకటించారు. కానీ గత 22 నెలలుగా ఎంతో ఆశతో ఎదిరిచుస్తున్న నిరాశ మిగిలిందనీ విఆర్ఏ జెఎసి సంఘం తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 21,000లు వారసత్వ విఆర్ఏలు, 3000 మంది ప్రత్యక్ష నియామక విఆర్ఏలు (50% మహిళా విఆర్ఏ కలరు.) రాష్ట్ర వ్యాప్తంగా తహసిల్దార్. ఆర్డిఓ,కలెక్టర్ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్నారు.
విఆర్ఏ లను అటెండర్, నైట్ వాచ్ మాన్, స్వీపర్ , డ్రైవర్ సెక్షన్ అసిస్టెంట్,కంప్యూటర్ ఆపరేటర్,వసులకు వాడుకోవద్దని విన్నపిస్తూ వారిని వెంటనే అట్టి విధుల నుండి విముక్తి కల్పించి ప్రభుత్వం ఇచ్చిన హామీలు వారి వారి గ్రామాలలో విదులు నిర్వహించాలని కోరారు.పలు డిమాండ్ లు అమలుచేయాలని పలుమార్లు ప్రభుత్వానికి రెవెన్యూ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికినీ ప్రభుత్వం మాకు తగిన న్యాయం చేయనందున రాష్ట్ర విఆర్ఏ ఐక్య కార్యాచరణ కమిటి పిలువు మేరకు తేది 13 జూలై 2022 రోజు నుండి గ్రామాలలోనే విధులు నిర్వహిస్తామని, జూలై 25 నుండి సమ్మెకు వెళ్తున్నామని అధికారులకు వినతి పత్రం ఇచ్చి తెలియజేశారు.ప్రధాన డిమాండ్లు
విఆర్ఏ పై స్కేల్ జీఓ వెంటనే విడుదల చేయాలి.అర్హత కలిగి విఆర్ఏ లకు పదోన్నతులు కల్పించాలి.
55సం. లు నిండిన విఆర్ఏ ల స్థానంలో వారసులకు విఆర్ఏ ఉద్యోగం ఇవ్వాలి.ములుగు జిల్లా గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ములుగు జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వైవీ గణేశ్ కి మెమొరాండం ఇవ్వటం జరిగింది.ములుగు జిల్లా విఆర్ఏ ల అధ్యక్షులు పాండవుల మహేందర్, నరేశ్,సురేష్,రాజు,వినత, రజిత మరియు జిల్లా విఆర్ఏ లు అందరు పాల్గొన్నారు.