వికలాంగుల పెన్షన్ 10 వేలకు పెంచాలి

వికలాంగుల సంక్షేమం సాధికారత కోసం వికలాంగుల బంధు పథకం ప్రవేశపెట్టాలి

అక్టోబర్ 9న ఛలో హైదరాబాద్
ఛలో హైదరాబాద్ కరపత్రం ఆవిష్కరణ

ఎన్ పి ఆర్ డి రాష్ట్ర కార్యదర్శి ఏం అడివయ్య

జహీరాబాద్ సెప్టెంబర్ 26 (జనం సాక్షి) వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జహీరాబాద్ నియోజక వర్గం సమావేశం సి ఐ టీయూ కార్యాలయంలో
జరిగింది. అనంతరం ఛలో హైదరాబాద్ కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది.
ఈసందర్భంగా ఎన్ పి ఆర్ డి రాష్ట్ర కార్యదర్శి యం అడివయ్యమాట్లాడుతూ*
తెలంగాణ రాష్ట్రంలో 21 రకాల వైకల్యాల ప్రకారం సుమారు 43.04 లక్షల మంది వికలాంగులు ఉన్నారని వీరిలో 5.16లక్షల మందికే పెన్షన్లు వస్తున్నాయని అన్నారు.
వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం 2016లో పేర్కొన్న అంశాలను అమలు చేయాలి.2016 ఆర్ పి డి చట్టం సెక్షన్ 79 ప్రకారం వికలాంగుల కమిషన్ ఏర్పాటు చేసి, ఛైర్మెన్, సభ్యులను నియమించాలి.ధరల పెరుగుదలకు అనుగుణంగా ప్రస్తుతం ఇస్తున్న 4016 నుండి 10,000లకు పెన్షన్ పెంచాలి. పెండింగ్ లో ఉన్న
ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలి.ఆసరా పెన్షన్లకు ఆదాయపరిమితి విధించే జీవో నెంబర్ 17 రద్దు చేయాలి.నామినేటెడ్ పదవుల్లో వికలాంగులకు రిజర్వేషన్స్ కల్పిస్తూ అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేయాలి అన్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో మాదిరిగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ అమలు చేయాలి.ప్రతి వికలాంగుల కుటుంబనికి 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలి.వైకల్య ధ్రువీకరణ పత్రం కలిగిన వికలాంగులకు ఆర్టీసీ మరియు రైల్వేలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి అన్నారు. 40 శాతం వైకల్యం కలిగిన వారందరికీ బస్పాసులు ఇవ్వాలి.ఉద్యోగ నియామకల్లో శారీరక వికలాంగుల రోస్టర్ 10లోపు తగ్గించాలి అన్నారు.ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలి అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కోనింటి నర్సింలు, ఆశ్వాక్, నియోజకవర్గ నాయకులు రాజుకుమర్, సంజీవ్, బిస్మిల్లా, శోభరాణి, సుభాష్, అoజాద్, మాణిక్, నారాయణ, చౌహాన్ రెడ్డి, శివరజు, రాజు, తదితరులు పాల్గొన్నారు.