వికాస తరంగిణి సేవలు ప్రశంసనీయం

 ఘనంగా చిన్నజీయర్ స్వామి జన్మదిన వేడుకలు
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): వికాస తరంగిణి సేవలు ప్రశంసనీయమని సుధాకర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ మీలా మహాదేవ్ అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో దీపావళి పండుగ, చిన్న జీయర్ స్వామి జన్మదిన వేడుకలు సందర్భంగా వికాస తరంగిణి సూర్యాపేట శాఖ ఆధ్వర్యంలో సుమారు 600మందికి పైగా పేదలకు నూతన వస్త్రాలను బహూకరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ వికాస తరంగిణికి తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు.అనంతరం మొరిశెట్టి శ్రీనివాసులు మాట్లాడుతూ చిన్న జీయర్ స్వామి వారి శిష్యులుగా ఉంటూ వికాస తరంగిణి సభ్యులు సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారుని కొనియాడారు.చేకూరి శైలజ పిల్లల చదువుల నిమిత్తం వికాస తరంగిణి ద్వారా పదివేల రూపాయలు ఆర్థిక సహకారం అందజేశారు.ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు మీలా వాసుదేవ్ , లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అనంతుల కృపాకర్ , వికాస తరంగిణి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ టిఎస్వి సత్యనారాయణ , దేవస్థాన ప్రధాన అర్చకులు నల్లన్ చక్రవర్తుల వేణుగోపాల ఆచార్యులు , వికాస తరంగిణి సభ్యులు ఓరుగంటి సోమన్న , గజ్జల రవీందర్, మిరియాల రమేష్, బజ్జూరి కృష్ణయ్య, రంగినేని మాధవరావు , సుభాషిని , గవ్వ వనజ , అరుణమ్మ , జ్ఞానకుమారి, మంజుల, ఉల్లెందుల అరుణ, సువర్ణ, విజయ,లక్ష్మి, ఉపేంద్ర,అరుణ తదితరులు సభ్యులు పాల్గొన్నారు.
Attachments area