విఘ్నాలు తొలగించి విజయాలు ప్రసాదించు విగ్నేశ్వరా…ఎడిపెల్లి నరేందర్

నిర్మల్ బ్యూరో, ఆగస్టు31,జనంసాక్షి,,                       విఘ్నాలు తొలగించి విజయాలు ప్రసాదించు విఘ్నేశ్వర అంటూ  పట్టణంలో ని బేస్తవార్ పెట్ కౌన్సిలర్ ఎడిపెల్లి నరేందర్ అన్నారు. బుధవారం వినాయక చవితి ని పురస్కరించుకుని వార్డు ప్రజలకు గోమయా గణపతులను పంపిణీ చేశారు.
బేస్తవార్ పెట్.కాల్వగడ్డ.విత్తలేశ్వర్ మండపాల లో ప్రతిష్టాపించిన వినాయ క మండపంలో లంబోధరున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ   మాట్లాడుతూ  ప్రతి సంవత్సరం అల్లోల గౌతమ్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు గోమయా గణపతి ప్రతిమలను పంపిణీ చేస్తున్నామని అన్నారు, పట్టణ, మరియు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వేలాది ప్రతిమలను పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు.  పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరు మట్టి ప్రతిమలను పూజించాలని కోరారు.ప్రతిమ లతో పాటు మొక్కలను పంపిణీ చేశారు.  ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈఆధ్యాత్మిక కార్యక్రమంలో తెరాస నాయకులు జంగిటి అశోక్,ఎడిపెల్లి రాజు,మాడ నాగభూషణ్,శేఖర్. వంశీ,రవి,మారుతి, .తదితరులు పాల్గొన్నారు