విజయంతో ముందు వరుసలో ఉండి భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలను చేరుకోవాలి

మహబూబాబాద్ బ్యూరో-జూలై18(జనంసాక్షి)

ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న నాణ్యమైన విద్య, వసతుల కల్పనపై తల్లిదండ్రులు అపోహ వీడాలని వాటికి నిదర్శనం 10/10 జిపిఎస్ సాధించిన విద్యార్థులు లేనని రాష్ట్ర ఆర్టీఐ కమిషనర్ డాక్టర్ గుగులోతు శంకర్ నాయక్ అన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక ఐఎంఏ హాల్ లో జిల్లాలోని పాఠశాలల్లో చదువుతూ 2022 పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 10/10 జిపిఏ సాధించిన 33 మంది విద్యార్థులకు, ప్రధానోపాధ్యాయులకు, వారి తల్లిదండ్రులకు సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఆర్టీఐ కమిషనర్, జిల్లా కలెక్టర్ కె. శశాంక తో పాల్గొన్నారు. సరస్వతి దేవి చిత్రపటానికి పూలమాలవేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన కమిషనర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, మానుకోట మట్టి పరిమళాలు గా పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 10/10 సాధించి జిల్లాను 20 వ స్థానంలో నిలిపి ఇతర విద్యార్థులకు ఆదర్శప్రాయంగా నేడు సన్మానం పొందుతున్న, విద్యార్థులకు వారి వెనక నుండి అన్ని వేళల్లో ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు గర్వపడుతున్నామని, 2019 లో 33జిల్లాల్లో మహబూబాద్ జిల్లా ఎస్ఎస్సి ఫలితాలలో 30 స్థానంలో ఉన్నదని, 2022 మార్చి పబ్లిక్ పరీక్షల్లో 20 స్థానం కు ఎగబాకిందని, జిల్లా కలెక్టర్ ను , విద్యాశాఖ అధికారులను అభినందిస్తున్నానని, రాబోవు ఫలితాల్లో కూడా అత్యుత్తమ ఫలితాలు సాధించాలని, రోజువారీగా ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని నేడు చేసిన పని కంటే రేపు అత్యుత్తమంగా, మెరుగుపరుచుకోవాలని, ఇతరులతో పోల్చుకోవడం రాదని ఈ పోటీ ప్రపంచంలో నాగరికతకు దూరంగా ఉన్నా రాష్ట్రంలోనే అత్యధిక గిరిజన జనాభా ఉన్న జిల్లా మానుకోట నుండి , గంగారం లాంటి మారుమూల మండలాల్లో నుంచి కూడా 10 జీపీఏ సాధించడం, గర్వించదగ్గ విషయమని ఎడ్యుకేషనల్ హబ్ భవిష్యత్తులో మానుకోట రూపుదిద్దుకోవాలని, 10/10 జి పి ఏ సాధించి జిల్లాకే ప్రేరణ ఇచ్చిన వారు మీరని, పై చదువుల్లో కూడా ఇలాంటి సన్మానాలు అభినందనలు పొందాలని మరొకరికి ఆదర్శంగా నిలవాలని, అబ్దుల్ కలాం చెప్పినట్లుగా కలలు కనాలి వాటిని సాకారం చేయుటకు కృషి పట్టుదల ఉండాలని, ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న మౌలిక వసతులు నాణ్యమైన విద్య పై తల్లిదండ్రులు పూర్తి భరోసాతో ప్రభుత్వ పాఠశాలల్లోనే మీ పిల్లల విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని, వారికె ఉద్యోగావకాశాలల్లో మొదటి ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చెప్పినట్లుగా చదివిన చదువును సమాజ సేవకై, ఉపయోగపడినప్పుడే దానికి విలువ ఉంటుందని,ప్రతి ఒక్కరి జీవితంలో ప్రాథమిక విద్య అతి ప్రధానమని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తల్లిదండ్రులు పిల్లల అభిప్రాయాలను తెలుసుకొని వారికి ఇష్టమైన రంగం వైపు చదువును అందించుటకు ప్రోత్సహించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ, ప్రతి ఒక్కరిలో విద్యార్థి జీవితం గొప్పదని, తొలిమెట్టు, చేరుకోవాల్సిన మైలురాయి అది విజయంతో మీలా ముందువరుసలో ఉంటేనే ఉన్నతమైన అవకాశాలు చేరుకోగలరని కలెక్టర్ అన్నారు. ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల నుండి 5 వేల మంది, ప్రైవేట్ పాఠశాలల నుండి 4వేల500 పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాస్తున్నారని, పదవ తరగతి విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ వహించి ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్, నిష్ణార్థులైన ఉపాధ్యాయుల చే తయారుచేసిన స్టడీమెటీరియల్స అందించడం ప్రణాళికా బద్దంగా ఎప్పటికప్పుడు ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరిగిందని, విద్యా శాఖ నుండి ఉపాధ్యాయుల శ్రమ కృషి ఎనలేనిదని, 2019 ఫలితాలల్లో 7 మందికి మాత్రమే 10 జి పి ఎ సాధించారని, ఈ సంవత్సరం ఫలితాల్లో 33 మంది సాధించడం గర్వించదగ్గ విషయమని, భవిష్యత్తులో వారు ఉన్నత స్థాయికి ఎదగాలని, గతంలో 30 స్థానంలో ఉన్న జిల్లా 20కి వచ్చిందని, ముందు రోజుల్లో కూడా ఎస్ఎస్సి ఫలితాలలో జిల్లాను ముందుంచాలి అంటే ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మీరే ఆదర్శమని, 33 లో 16 మంది మోడల్ స్కూల్ విద్యార్థులు ఉండడం ప్రత్యేకమని, ఆర్టీఐ కమిషనర్ గారు 2 వేల మందికి ప్యాడ్లు పుస్తకాలు, పరీక్షల మెటీరియల్ అందించి వారిని ప్రోత్సహించారని, మనసుకు మెదడుకు ఏ రంగంలో నైతే అభిప్రాయం ఉంటుందో దానికి అనుగుణంగా ముందువరుసలో ఉండేట్లు చదవాలని, తల్లిదండ్రులు వారి వ్యక్తిగత వికాసానికి తీవ్రమైన కట్టుబాట్లు ఆడపిల్లలపై పెళ్లిళ్లు ఆంక్షలు విధించరాదని, వారికి ప్రేరణ ఇచ్చి ముందుకు నడిపించాలని కలెక్టర్ వారి తల్లిదండ్రులను కోరారు. అనంతరం 10/10 జిపిఏ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు, ప్రధానోపాధ్యాయులకు తల్లిదండ్రులను శాలువా కప్పి సన్మానించి సర్టిఫికెట్, ఫీల్డ్, డిక్షనరీ లను అందజేసి కమిషనర్, కలెక్టర్లు వారిని ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి ఎస్పీ యోగేష్ గౌతమ్, జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ హై, సేవ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాజు, తహసిల్దార్ నాగ భవాని వారి తల్లిదండ్రులు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.