విద్యత్ సమస్యను పరిష్కరించాలి -సర్పంచ్ అంజమ్మ
ఝారసంగం అక్టోబర్ 31 జనం సాక్షి . మండల పరిధిలోని చిలామామిడి, అనంతసాగర్ గ్రామాలకు ఎప్పుడు పడితే అప్పుడు విద్యుత్ నిలిపివేయడం తో గ్రామాల్లో అనేక రకాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని సర్పంచ్ పి.అంజమ్మ అంజన్న పాటిల్, అన్నారు. సోమవారం జహీరాబాద్ పట్టణంలో డివిజన్ స్థాయి అధికారులకు కలసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మా గ్రామానికి సరఫరా అయ్యే లైను ఆరు గ్రామాలకు కనెక్టివిటీగా ఉండడంతో ఏ చిన్న సమస్య వచ్చినా చింతల్ ఘాట్ గ్రామం వద్ద ఉన్న లైన్ కట్ చేయడంతో చిలమామిడి గ్రామంలో విద్యుత్ సరఫరా సమస్య తలెత్తుతుందని, తక్కువ వోల్టేజి, హై వోల్టేజీ సమస్యలు తలెత్తడంతో రైతులు బోర్లు బావులు నడవక చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. విద్యుత్ శాఖ అధికారులతో సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. గత నెల 25వ తారీఖున దీపావళి పండుగ నాడు తమ గ్రామంలో పగలు రాత్రి కరెంటు లేక గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని తమ గ్రామానికి సమీపంలో ఉన్న జీర్లపల్లి ఫీడర్ నుంచి విద్యుసరఫరకు చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్ అంజమ్మ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ రాజు,విరన్న గోపాలకృష్ణ, రాచన్న, శేఖర్, జయరాజ్, వెంకట్, సాయన్న, అంజన్న, సి,ఎచ్ వెంకట్, శంకరయ్య తదితరులు, పాల్గొన్నారు.