విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

తక్షణం కాషాయీకరణను ఆపేయాలి
పేరుకుపోయిన బకాయిలను చెల్లించాలి: గేయానంద్‌
అనంతపురం,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి): కార్పొరేట్‌ విద్యాసంస్థలకు ఊడిగం చేస్తూ కేంద్ర ప్రభుత్వం విద్య కాషాయికరణ,వ్యాపారీకరణ చేయాలని చూస్తోందని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ పేర్కొన్నారు. విద్యారంగ సంస్కరణల పేరుతో బిజెపి కుట్రలు చేస్తోందిన అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా సంవత్సరానికి రూ.2కోట్లు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. ప్రధాని మోడీ పరిపాలనలో విదేశీ పర్యటనల కోసం రూ.1500కోట్లు ప్రజాధనాన్ని వెచ్చించారని,విద్యను కాశాయీకరణ, వ్యాపారీకరణ చేయడానికి అన్ని కుట్రలు చేశారని తెలిపారు. యుజిసి రద్దుచేసి హెచ్‌ఇసిఐ ఏర్పాటు చేయడం అందులో భాగమే అన్నారు. ఒక్క విద్యాసంస్థను స్థాపించకుండానే రిలయన్స్‌ అధినేతకు ఉత్తమ విద్యావేత్త అవార్డు అందించిన ఘనత ప్రధానమంత్రి నరేంద్రమోడీకే దక్కుతుందని ఎద్దేవాచేశారు. కేంద్రం వెంటనే రద్దు చేసిన యుజిసిని కొనసాగించి విశ్వవిద్యాలయాల అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. పరిశోధక విద్యార్థులకు నెలకు రూ.8వేలు ఇవ్వాలన్నారు. రాష్ట్ర విభజన సమయంలో
పేర్కొన్న ప్రత్యేక ¬దా, విభజన హావిూలన్నింటిని నెరవేర్చాలన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమను అనంతలో కేంద్రీయ విశ్వ విద్యాలయం ప్రకాశం జిల్లాలో గిరిజన విశ్వ విద్యాలయాలను ప్రారంభించాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రచార ఆర్భాటాలు తప్ప అభివృద్ధి మాత్రం పట్టించుకోవడం లేదన్నారు.  కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తానని చెప్పి విద్యను పేదలకు దూరం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులు లేరని నాలుగు వేల పాఠశాలలు, 1100 వసతి గృహాలు మూసివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా వ్యాపారానికి తెరలేపి విద్యార్థుల ఆత్మహత్యకు పరోక్షంగా ప్రభుత్వమే కారణమవుతోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి రాయలసీమలో ఉన్న ప్రయివేట్‌, కార్పొరేట్‌ విద్యాలయాల్లో కూడా ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా ఉచిత విద్యను అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. దీనికి సంబంధించి ఫీజులు మొత్తం ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న ఉపకార వేతనాలు, ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులను మోసం చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పడానికి విద్యార్థులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పోలవరం పూర్తిచేసే ఎన్నికలకు వెళతానంటూ చెప్పుకుంటూ వేల కోట్లు కవిూషన్ల పేరుతో దండుకుంటున్నారని మండిపడ్డారు.

తాజావార్తలు