విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
ఎస్ఎఫ్ఐ,పిడిఎస్యు ఆధ్వర్యంలో కురవి మండల వ్యాప్తంగా బంద్ విజయవంతం
కురవి జులై -20
(జనం సాక్షి న్యూస్)
కురవి మండల వ్యాప్తంగా బుధవారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విజయవంతంగా బంద్ పాటించి, మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ,పిడిఎస్యు సంఘాల ఆద్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు పట్ల మధు,పిడిఎస్యు జిల్లా నాయకులు దేవేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… బడులు తెరిచి ఇన్ని రోజుకు అవుతున్న కనీసం పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదు అని అన్నారు.దాంతో పాటు దాదాపు మూడు సంవత్సరాల నుండి స్కూల్ డ్రెస్లు ఇవ్వడం లేదు అన్నారు.మన ఊరు -మన బడి కార్యక్రమం కింద అన్ని పాఠశాలకు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు.విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలు చేస్తామని హెచ్చారించారు.ప్రభుత్వ పాఠశాల,కళాశాలలో అన్ని వసతులతో కూడిన సౌకర్యాలు ఉంటేనే విద్యార్థులు ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాను అభ్యసించడం సాధ్యమవుతుందని వాళ్ళు అన్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి జ్యోతిబసు,డివిజన్ ఉపాధ్యక్షుడు నవీన్,మండల అధ్యక్షుడు వీరెందర్ మండల నాయకులు సాయి ,కిరణ్,మహేష్,భరత్,అనిల్,శరత్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.