విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి : చొప్పరి శరత్
ఎఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్
కేసముద్రం జూలై 20 జనం సాక్షి / విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు పంపిణీ చేయాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించాలని, పెంచిన బస్ పాస్ చార్జీలు తగ్గించాలని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల విచ్చలవిడి ఫీజుల దోపిడీని అరికట్టాలని ఎఐఎస్ఎఫ్ మండల కన్వీనర్ చొప్పరి శరత్ డిమాండ్ చేశారు.
బుధవారం కేసముద్రంలో ఎఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా చొప్పరి శరత్ మాట్లాడుతూ.. పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా విద్యారంగ సమస్యలు పరిష్కారంకు నోచుకోలేదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు పూర్తి స్థాయిలో రాకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో బోధన కు సంబంధించి ఇబ్బందులు తలెత్తున్నాయని, ప్రైవేట్ విద్యాసంస్థల్లో బోధన ప్రారంభించడంతో ప్రభుత్వ పాఠశాలలో చదువే విద్యార్థులకు విద్యాప్రమాణాలు ఏవిధంగా మెరుగుపడతాయని ప్రశ్నించారు.అదేవిధంగా ఏకరూప దుస్తులు(యూనిఫాం) ఇంతవరకు లేకపోవడం బాధకరమని అన్నారు.అదేవిధంగా కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యాశాఖ జి.ఒ. నెంబర్ ఎమ్ఎస్ 42 నిబంధనలను తృంగల్లో తొక్కి ఇష్టారాజ్యంగా ధనార్జనే ధ్యేయంగా విద్యార్థుల తల్లిదండ్రుల ముక్కు పిండి విచ్చలవిడిగా డొనేషన్,అడ్మిషన్,ట్యూషన్, షూ, టై, బెల్టు, యూనిఫామ్ ఇట్లాంటి అనేక రకాల పేర్లతో వేయిల రూపాయల వసూళ్ల దందా చేస్తున్నా విద్యాశాఖ అధికారులు చోద్యం చూస్తూ ఉండడం వెనుక రహస్య ఒప్పందం కుదిరిందా అని ప్రశ్నించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన సౌకర్యం ఏర్పాటు లేక పోవడంతో దూర ప్రాంతాల నుంచి మండల కేంద్రంకు వచ్చి చదువుకునే విద్యార్థులు ఆర్ధకాలితో అలమటిస్తున్నారని, అదేవిధంగా బస్ చార్జీల పెంచడం వలన ఆర్ధిక భారంతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.ఈ బంద్ తోనైనా రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రభుత్వ విద్యాసంస్థలలో మౌళిక సదుపాయాలు కల్పించి ఖాళీగా వున్న పోస్టులు, ఎం ఈ ఓ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు పంపిణీ చేయాలని, ప్రతి పాఠశాలలో స్వచ్ఛ కార్మికులను నియమించాలని, మధ్యాహ్న భోజననికి నిధులు పెంచి నాణ్యమైన భోజనం అందించాలని, మన ఊరు – మన బడిలో అన్ని పాఠశాలలను చేర్చి అభివృద్ధి చేయాలని, అధిక ఫీజుల దోపిడిని అరికట్టి జి ఓ ఎం ఎస్ నెం.42 ను అమలు చేసి జిల్లా ఫీజు నియంత్రణ కమిటీ (డి ఎఫ్ ఆర్ సి) ని ఏర్పాటు చేసి ఫీజు నియంత్రణ చట్టంను తీసుకురావాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించి, విద్యార్థులకు ఉచిత బస్ ఇవ్వాలని, పెరిగిన ధరలకనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థుల ఆగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం గురికాక తప్పదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఎఫ్ నాయకులు సోమారపు సందీప్, యం. శివ, వంశీ, సాయి మరియు తదితరులు పాల్గొన్నారు.
Attachments area