విద్యార్థికి నిజమైన దేవాలయం పాఠశాల

ఏ  విద్యార్థి భవిష్యత్తు అయిన పాఠశాలలోనే నిర్ధారించబడుతుంది
 జ్యోతి హై స్కూల్ స్వర్ణోత్సవ వేడుకల్లో మాజీ జెడ్పీ  చైర్మన్. సీ. డి. రవికుమార్
 మిర్యాలగూడ.జనం సాక్షి
 విద్యార్థికి నిజమైన దేవాలయం పాఠశాల యేనని  మాజీ జెడ్పీ చైర్మన్ సి డి రవి కుమార్ అన్నారు. స్థానిక ఎస్పీ కన్వెన్షన్ హాల్లో  శనివారం నిర్వహించిన జ్యోతి హై స్కూల్ స్వర్ణోత్సవ వేడుకల్లో  ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఈ విద్యార్థి భవిష్యత్తు అయిన పాఠశాల నుండి నిర్ధారించబడుతుందని  అన్నారు. మిర్యాలగూడ పట్టణంలో ప్రప్రథమంగా స్థాపించిన  ఇంగ్లీష్ మీడియం స్కూల్ జ్యోతి హై స్కూల్ అని  రూపస్ సారు ఏర్పాటు చేసిన పాఠశాల  లో మా పిల్లలు కూడా విద్యాభ్యాసం చేశారని  స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన అనంతరం  వారు మాట్లాడే ఆంగ్ల భాషను చూసి  తాను ఆశ్చర్యపోయానన్నారు.
 ఆయన ఆధ్వర్యంలో ఆంగ్ల భాష ప్రావీణీతతో పాటు చక్కటి సంస్కారం. జీవన వైవిధ్యాన్ని  నేర్పించారన్నారు. మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్  తిరునగర్ భార్గవ్ మాట్లాడుతూ తను కూడా  జ్యోతి హై స్కూల్ లో విద్యాభ్యాసం చేశానని  అంతకుముందు  సెంట్ మేరీస్  పాఠశాలలో చదివి  తన సోదరి   భవాని తో పాటు   జ్యోతి హై స్కూల్ లో  విద్యాభ్యాసం చేశానని అన్నారు. రూఫస్ సార్ శిష్యరికం లో తాను ఎంతో నేర్చుకున్నానని   అన్నారు. తమ భవిష్యత్తుకు  ఉన్నత మార్గం చూపిన  రూఫస్ సార్ కు ఆజాన్మంతం రుణపడి ఉంటా అన్నారు.  ఆయనకు భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా  తాను ముందు ఉంటానని హామీ ఇచ్చారు.  సభలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు  శంకర్ నాయక్ మాట్లాడుతూ  రూపస్ సార్ మార్గదర్శనంలో  తామెంతో ఉన్నత స్థితికి చేరుకున్నామన్నారు. ముందుగా జ్యోతి హై స్కూల్ అధినేత కే. జె. రూఫస్ సార్ ను ఆహ్వానించి సన్మానం చేశారు.. సభలో పాఠశాల లో చదివిన పూర్వ విద్యార్థిని. విద్యార్థులు సార్ తో తమకున్న అనుభూతులను పంచుకున్నారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ స్వర్ణోత్సవ సభను పూర్వ విద్యార్థులు  తిరునగరు  భార్గవ్. రాయపూడి భవాని. శ్రీనివాస్ సింగ్. చరణ్. మాధవ్ లు నిర్వహించారు