విద్యార్థినీలకు సైకిల్స్ పంపిణీ

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం కోట్యా నాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని గుళ్ళబండ తండా విద్యార్థినిలకు సూర్యాపేట ఆదర్శ స్కూల్  1998 – 99 ఎస్ఎస్సీ బ్యాచ్ కు చెందిన విద్యార్థులు సైకిల్స్ పంపిణీ చేశారు.ఎంపీపీఎస్ గుళ్ళబండ తండాలో ఉపాధ్యాయురాలిగా పని చేయుచున్న అదే బ్యాచ్ కు చెందిన స్టూడెంట్… తండా నుండి 3 కిమీ దూరంలో గల హైస్కూల్ కు చదువుకోవడానికి కాలినడకన వెళ్తున్న విద్యార్థినుల అవస్థలు గమనించి వారి స్నేహితులకు వివరించారు.వెంటనే సానుకూలంగా స్పందించిన వారు విద్యార్థినులకు సైకిళ్ళను అందించేందుకు సహకరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధరావత్ హైమావతి , ఎంఈఓ
ఐ.శాంతయ్య , కాంప్లెక్స్ హెచ్ఎం జి.అశోక్ , హెచ్ఎం టి.విజయకుమారి , సిఆర్పి సోమేశ్ తదితరులు పాల్గొన్నారు.