విద్యార్థి అనుమానాస్పద మృతి
విజయవాడ,సెప్టెంబర్29(జనంసాక్షి): కృష్ణాజిల్లా మైలవరంలో యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. స్థానిక గాంధీ కో ఆపరేటివ్ బ్యాంక్ భవనంపై నుంచి పడి యువకుడు మృతి చెందాడు. మృతుడు బీటెక్ ఫస్టియర్ విద్యార్థి రామకృష్ణగా గుర్తించారు. కాగా రామకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడా ? లేక ఎవరైనా అతడిని పై నుంచి తోసి హత్యచేశారా ? అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.