విద్యార్థి, ఉపాధ్యాయ సమస్యలపై ఆందోళన కారక్రమాలు

ఆదిలాబాద్‌, జూలై 23: విద్యారంగంలో నెలకొన్న సమస్యపై దశలవారిగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని డీటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శామ్యూల్‌, సుధాకర్‌ తెలిపారు. విద్యాశాఖలో ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉన్న ఎంఇవో పోస్టులను భర్తీ చేయకపోవడంతో పర్యవేక్షణ లేక విద్యారంగం గాడితప్పుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పేరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచేందుకు పీఆర్‌సీని వెంటనే వేయాలని భాషా పండితులకు నష్టం కలిగించే 1-2005 చట్టాన్ని, ఎజెడ్‌ ఉపాధ్యాయులకు నష్టం కలిగించే 37-2005 చట్టాలను రద్దు చేయాలని, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభించాలని వారు కేంద్రానికి డిమాండ్‌ చేశారు. ఈ సమస్యలపై ఈ నెల 27న డివిజన్‌ స్థాయిలలో, అగస్టు 22న జిల్లా కేంద్రంలో సెప్టెంబర్‌ 22న హైదరాబాద్‌లో ధర్నా కార్యక్రమాలు చేపట్టామని వారు పేర్కొన్నారు. ఉపాధ్యాయ, విద్యా రంగం, సామాజిక అంశాలపై తలపెట్టిన ఈ ఆందోళన కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

తాజావార్తలు