విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించిన ఎస్సై రమేష్ బాబు
కేసముద్రం జులై 22 జనం సాక్షి / కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా శుక్రవారం స్థానిక ఎస్సై రమేష్ బాబు జిల్లా పరిషత్ హైస్కూల్ కేసముద్రం విలేజ్ పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…విద్యార్థినీ విద్యార్థులు చెడు ఆకర్షణలకు లోను కావద్దని,జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మైనర్ పిల్లలు వాహనములు నడిపిన వారి తల్లిదండ్రులు బాధ్యులు అవుతారని,18 సంవత్సరాల వయస్సు పూర్తయి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే వాహనములు నడపవలెనని తెలియజేశారు.విద్యార్థినీ విద్యార్థులు మొబైల్ గేములు ఆడుకుంటూ తమ తల్లిదండ్రుల అకౌంట్ నెంబర్స్ అపరిచిత యాప్ లోకి అపరిచితులకు చెప్పరాదని దీనివలన బ్యాంక్ అకౌంట్లో ఉండే నగదు మాయమయ్యే పరిస్థితి ఉంటుంది అని తెలియజేశారు.పబ్లిక్ ప్రాపర్టీలను తెలియక లేదా తెలిసి తుంటరిగా నష్టపరిచినచో కేసులు తీవ్రంగా ఉంటాయని కాబట్టి పబ్లిక్ ప్రాపర్టీలను కాపాడుకోవాలని కోరారు.విద్యార్థినీ విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరారు. ఈ సందర్భంగా కొంతమంది విద్యార్థినీ విద్యార్థులకు పోలీస్ కావాలంటే మానసికంగా భౌతికంగా దృఢంగా ఉండాలి మరియు చక్కగా చదువుకోవాలి అప్పుడే పోలీస్ అవుతారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు బండారు నరేందర్ ఉపాధ్యాయురాలు పద్మలత ,9 మరియు 10వ తరగతి విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
Attachments area
|