విద్యార్థులతో చెలగాటమాడుతున్న ఆర్టీసీ అధికారులు. చెంగోల్ పర్వతాపూర్ గ్రామాలకు బస్సులు నడపడంలో దోబూచులాట. అంబేద్కర్ ప్రజా సంఘం తాండూర్ డివిజన్ కన్వీనర్ వెంకటేష్.
వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం చెంగోల్ , పరాతాపూర్ గ్రామాలకు బస్సుల సౌకర్యం లేక విద్యార్థులు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.విద్యార్థులతో ఆర్టీసీ అధికారులు చెలగాటం ఆడుతున్నారు. ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని తాండూర్ ఎమ్మెల్యే హైలెట్ రోహిత్ రెడ్డి అధికారులను ఆదేశించినప్పటికీ నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటికే తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి విద్యార్థుల బస్సుల పాసుల కోసం 5 లక్షలు స్వయంగా చెల్లించారు.అయితే ఆర్టీసీ అధికారులు ఆయా గ్రామాలకు బస్సులు నడిపించకపోవడంతో విద్యార్థులు ప్రజలు కాలినడకతో రాకపోకలు చేస్తూ ఇబ్బందులకు గురవుతున్నారు. బస్సులు నడపకపోవడం కారణంగా సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరం నుంచి నడిచి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చెంగోల్ పర్వతపూర్ గ్రామాలకు వెంటనే బస్సులు నడిపించాలని ఆర్టీసీ డిఎం సమతకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని అంబేద్కర్ ప్రజా సంఘం తాండూర్ డివిజన్ కన్వీనర్ వెంకటేష్ విద్యార్థులతో కలిసి ఆందోళన చేపట్టారు. బస్సులు నడిపించడంలో దోబూచులాడుతూ నిర్లక్ష్యం వహిస్తున్న ఆర్టీసీ అధికారులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులతో కలిసి చెంగోల్ గ్రామస్తులు పోచప్ప, శేఖర్, రంగప్ప ,శివరాజ్, ఎల్లప్ప , తదితరులు డిమాండ్ చేశారు.