విద్యార్థులు భావవ్యక్తీకరణ పెంపొందించుకునే ల ఉపాధ్యాయులు కృషి చేయాలి కలెక్టర్ కె.శశాంక

తొర్రూర్ 23 జూన్( జనంసాక్షి )
విద్యార్థి దశలోనే విద్యార్థులు భావ వ్యక్తీకరణ పెంపొందించుకునే లా ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కొండూరు శశాంక అన్నారు. ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా తొర్రూర్ మండలం అమ్మాపురం  గ్రామంలో జరిగిన సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై మొదటగా పాఠశాల కు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించడం జరిగింది. అనంతరం ఏర్పాటుచేసిన సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ అమ్మా పురం గ్రామం లో ప్రాథమిక పాఠశాలలో 447 మంది విద్యార్థులు ఉండడం అభినందనీయమని ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందాన్ని అభినందిస్తూ,ఉన్నత పాఠశాలలో కూడా ప్రస్తుత 257 మంది విద్యార్థుల కంటే ఎక్కువ మంది విద్యార్థుల నమోదుకై ఉపాధ్యాయ బృందం కృషి చేయాలని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మౌలిక వసతుల సమకూర్చుట కై స్థానిక శాసనసభ్యులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరియు అధికార యంత్రాంగం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలసి కృషి చేస్తామని ఆయన అన్నారు.
మహబూబాబాద్ జిల్లా జడ్పీ ఫ్లోర్ లీడర్ తొర్రూరు జడ్పిటిసి మంగళపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు మీ విశ్వాసం, నమ్మకం కోసం గుడికి మొక్కండి కానీ పిల్లలను బావిభారత పౌరులకు అందించాల్సిన జ్ఞానం తల్లిదండ్రి దగ్గర ఇంట్లో నేర్చుకుంటే,బడి లోకి వచ్చి భవిష్యత్తుకు సంబంధించిన జ్ఞానాన్ని నేర్చుకో కలుగుతారని ఈ జ్ఞానాన్ని ఎప్పటికీ పిల్లలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అది ఎప్పటికీ ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. కావున గ్రామ పెద్దలు ప్రజా ప్రతినిధులు అధికారులు సహాయ సహకారాలతో విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన జ్ఞానసముపార్జన అందించడానికి అందరూ కృషి చేయాలని అందుకు నా వంతుగా నేను ఎల్లప్పుడూ ముందు ఉంటానని ఆయన తెలిపారు.
ఎక్కడ దమ్ము ఉంటుందో, ఎక్కడ దైర్యం ఉంటుందో, ఎక్కడ విశ్వాసం ఉంటుందో అక్కడికి విద్యార్థులు తండోపతండాలుగా తరలి వస్తారని అనడానికి నిదర్శనం మన అమ్మాపురం ప్రాథమిక,ఉన్నత పాఠశాల అని వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవీంద్ర అన్నారు.*
ఈ సందర్భంగా గౌరవ కలెక్టర్ మరియు ప్రజా ప్రతినిధులు అధికారులచే ఈ విద్యా సంవత్సరం పాఠశాలలో చేరిన విద్యార్థిని,విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కడెం యాకయ్య, సిడబ్ల్యూసీ చైర్పర్సన్ నాగవాణి, ఎంపీటీసీ1 డోనక ఉప్పలయ్య, డిప్యూటీ సీఈఓ నర్మద, డిఈఓ అబ్దుల్ హై,డిడబ్ల్యుఓ స్వర్ణలత లెనిన, ఆర్డిఓ రమేష్ బాబు,పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, లక్ష్మీనారాయణ,ఎంఈఓ రాము,ఎంపీడీవో కుమార్, తాసిల్దార్ రాఘవరెడ్డి, వ్యవసాయ అధికారి కుమార్, పంచాయతీ కార్యదర్శి శ్రావణి, వార్డు సభ్యులు శ్రీకాంత్ అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.